Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sports Car Racing: హైదరాబాద్‌లో స్పోర్ట్స్ కార్ రేసింగ్.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం..

Hyderabad Street Race: భాగ్యనగరంలో స్పోర్ట్స్ కార్లు రయ్ రయ్ మని దూసుకెళ్లనున్నాయి. హైదరాబాద్ అడ్డాగా స్పోర్ట్స్ కార్ రేసింగ్ కనువిందు చేయనుంది.

Sports Car Racing: హైదరాబాద్‌లో స్పోర్ట్స్ కార్ రేసింగ్.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం..
Sports
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 22, 2021 | 8:11 AM

Hyderabad Street Race: భాగ్యనగరంలో స్పోర్ట్స్ కార్లు రయ్ రయ్ మని దూసుకెళ్లనున్నాయి. హైదరాబాద్ అడ్డాగా స్పోర్ట్స్ కార్ రేసింగ్ కనువిందు చేయనుంది. రాఖీ పండు పర్వదినాన.. హైదరాబాద్‌లో స్పోర్ట్స్ కార్ రేసింగ్ జరగనుంది. స్ట్రీట్ సర్క్యూట్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఐటీసీ కోహినూర్ పరస ప్రాంతాల్లో ఈ రేసింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ స్పోర్ట్స్ కార్ల రేస్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, సినీ హిరో విశాల్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

గతంలోనూ పలుమార్లు హైదరాబాద్‌లో స్పోర్ట్స్ కార్ రేసింగ్ నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే ఫార్ములా 4 రేసులను హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరులోనూ నిర్వహించనున్నట్టు రేసింగ్‌ ప్రమోషన్స్‌ (ఆర్‌పీపీఎల్‌) నిర్వాహకులు వెల్లడించారు. ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్‌ (ఎఫ్‌ఐఏ) మద్దతుతో ఎఫ్‌-4 ఇండియన్‌ చాంపియన్‌షిప్‌, ఫార్ములా రీజినల్‌ ఇండియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ఈ నాలుగు నగరాలలో నిర్వహించనున్నారు. ఎఫ్‌-3 కార్లతో నిర్వహించబోయే ఈ పోటీలు భారత్‌లో ఇదే తొలిసారి. వీటి నిర్వహణ కోసం హైదరాబాద్‌లో ఇప్పటికే వంద కోట్ల రూపాయలను కార్లు, మౌలిక వసతులపై వెచ్చించినట్టు నిర్వాహకులు తెలిపారు. 2022లో ప్రారంభం అయ్యే ఈ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఒక నెల పాటు కొనసాగుతుంది. నెలలో ఐదు వేదికల్లో పోటీలు జరుగుతాయి.

Also read:

Raksha Bandhan 2021: మీ సోదరులకు రాఖీ ఎందుకు కట్టాలి.. ఏ సమయంలో కడితే మంచిదో తెలుసా..

Coronavirus: చిన్న పిల్లల నుంచి పెద్దలకు కరోనా వ్యాప్తి ముప్పు చాలా ఎక్కువ..పరిశోధనల్లో వెల్లడి..జాగ్రత్తలు ఇలా!

Sumanth: ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం లిరికల్ సాంగ్ రిలీజ్.. వైవిధ్యంగా మళ్లీ మొదలైంది..