Raksha Bandhan 2021: మీ సోదరులకు రాఖీ ఎందుకు కట్టాలి.. ఏ సమయంలో కడితే మంచిదో తెలుసా..

మన హిందూ సంప్రదాయంలో ప్రతి పండగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా రాఖీ పండగు.. అన్నాచెల్లెల్లు, అక్కతమ్ముళ్ల మధ్య ప్రేమకు ప్రతిరూపంగా రాఖీ పండుగను జరుపుకుంటారు

Raksha Bandhan 2021: మీ సోదరులకు రాఖీ ఎందుకు కట్టాలి.. ఏ సమయంలో కడితే మంచిదో తెలుసా..
Follow us

|

Updated on: Aug 22, 2021 | 7:57 AM

మన హిందూ సంప్రదాయంలో ప్రతి పండగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా రాఖీ పండగు.. అన్నాచెల్లెల్లు, అక్కతమ్ముళ్ల మధ్య ప్రేమకు ప్రతిరూపంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. తమ తొబుట్టువులకు రక్షణగా, అండగా.. ఉండాలని ఈ పండుగను నిర్వహిస్తుంటారు. మన దేశంలో ఈ పండగును అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సౌత్, నార్త్ ఇండియాలలో రాఖీ పండుగకు అనేక పేర్లు ఉన్నాయి. భాయ్ దూజ్, రాక్షా బందన్, రాఖీ పండగ అని పిలుస్తుంటారు. ఈరోజు తొబుట్టువులు ఎంత దూరంలో ఉన్నా.. తమ సొదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తుంటారు. ఈరోజు రాఖీ పౌర్ణమి.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. అయితే రాఖీ కట్టడానికి శుభ ముహుర్తం ఎప్పుడో తెలుసుకుందామా.

శుభ ముహుర్తం.. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజు ఆగస్ట్ 22న రాఖీ పౌర్ణమి.. రాఖీ కట్టడానికి శుభ ముహుర్తం.. మధ్యాహ్నం 1.42 నిమిషాల నుంచి 4.18 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టవచ్చు. ఇది అపారహ్నా ముహుర్తం. ఒకవేల ఈ సమయంలో రాఖీ కట్టలేని వారు ప్రదోష కాలానికి అంటే సూర్యాస్తమయంలో ప్రారంభం 96 నిమిషాల వరకు అంటే…6.15నుంచి ఎప్పుడైన కట్టవచ్చు. ఆగస్ట్ 22న రాఖీ పౌర్ణమి.. సాయంత్రం 5.31 వరకు కట్టాలి.

చరిత్ర.. ప్రాముఖ్యత.. మహాభారత సమయంలో ద్రౌపది రాజు శిశుపాలుడికి వ్యతిరేకంగా తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించే సమయంలో కృష్ణుడి మణికట్టుపై రాఖీ కట్టినట్లుగా చెబుతుంటారు. కృష్ణుని చేతి నుంచి తీవ్ర రక్త స్రావం అవుతున్న సమయంలో ద్రౌపది ఆమె చీరను చింపి కృష్ణుడి చేతికి కట్టు కట్టింది. దీంతో ఆమెను కృష్ణుడు అప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఆమెను రక్షించడానికి, ఆరాధించడానికి ఎప్పుడూ అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ రాఖీ పండగను జరుపుకుంటున్నట్లుగా అంటుంటారు.

నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ విభజన సమయంలో (1905) సామూహిక రక్షా బంధన్ పండుగను ప్రారంభించారు. దీనిలో అతను హిందూ, ముస్లిం మహిళలను ఇతర సమాజంలోని పురుషులకు రాఖీ కట్టాలని తెలిపారు. హిందువులు, ముస్లింల మధ్య విభజనను సృష్టించడానికి బ్రిటిష్ ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు ఈ పండగు ఉపయోగపడింది.

Also Read: Rakshabandhan 2021: వాట్సప్‌లో రాఖీ శుభాకాంక్షలు.. మీ ఫోటో స్టిక్కర్‌తో ఇలా పంపించండి..

Rakha Bandan 2021: మీ సొదరులకు రాఖీ కట్టేప్పుడు ఈ విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకూడదు.. ఎంటో తెలుసుకొండి..

Gmail Schedule Email: సెట్ చేసుకున్న సమయానికి మెయిల్‌ ఎలా పంపాలో తెలుసా.? ఈ ఫీచర్‌ గురించి తెలుసుకోవాల్సిందే.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో