‘నా భార్య ప్రియుడితో పారిపోయింది.. మరి కాసేపట్లో రైల్వేస్టేషన్‌ను పేల్చేస్తా’
ప్రియుడితో పారిపోయిన భార్యను ఇంటికి రప్పించేందుకు ఓ భర్త చేసిన నిర్వాకం పోలీసులను హడలెత్తించింది. దెబ్బకు అరెస్టు చేసి కటకటాల వెనుక వేశారు. బీహార్ రాజధాని పాట్నలో ఈ షాకింగ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
ప్రియుడితో పారిపోయిన భార్యను ఇంటికి రప్పించేందుకు ఓ భర్త చేసిన నిర్వాకం పోలీసులను హడలెత్తించింది. దెబ్బకు అరెస్టు చేసి కటకటాల వెనుక వేశారు. బీహార్ రాజధాని పాట్నలో ఈ షాకింగ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
సోమవారం రాత్రి పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌కు ఓ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. పట్నా రైల్వే స్టేషన్‌లో బాంబు ఉందని, కొద్ది నిముషాల్లో స్టేషన్‌ను పేల్చివేస్తానని ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌ఫీఎఫ్), జనరల్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) దర్యాప్తు ప్రారంభించాయి. సోమవారం అర్థరాత్రి మొత్తం 10 ప్లాట్‌ఫారమ్‌లతోపాటు, వెయిటింగ్ హాళ్లు, విశ్రాంతి గదులు, వాష్‌రూమ్‌లు, క్లాక్ రూమ్, పార్కింగ్ ఏరియాలో ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్లాట్‌ఫాంలతోపాటు వచ్చేపోయే రైళ్లలోని ప్రయాణికుల సమాన్లు కూడా తనిఖీ చేశారు. ఐతే ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదని పాట్నా ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ విపిన్ చతుర్వేది తెలిపారు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో పాటు పాట్నా పోలీసులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.
పోలీసులు కాలర్ ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసి అరెస్టు చేసినట్లు బీహార్ ఎస్పీ (రైల్) అమృతేందు శేఖర్ ఠాకూర్ తెలిపారు. ఎస్సీ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని రాజేష్ కుమార్ రంజన్‌గా గుర్తించారు. రాజేష్ భార్య ఆమె ప్రియుడితో పారిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి రప్పించేందుకే పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌ను పేల్చేస్తామని బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు రాజేష్ కుమార్ రంజన్ విచారణలో తెలిపాడు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. అతను చెప్పేది నిజమా? లేదా ఇందులో ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు’ ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.