రూ.100 రిఫండ్‌కు ఫోన్ కొట్టి.. వేల రూపాయలు పొగొట్టుకున్నాడు..!

ఈ హైటెక్ యుగంలో మోసాలు కూడా హైటెక్‌గానే ఉంటున్నాయి. ఒక్క ఫోన్ కాల్‌తో డబ్బులు కూడా పొగుట్టుకుంటున్నారు బాధితులు. సాధారణంగా ఏటీఎం కార్డుల వివరాల గురించి ట్రాప్ చేసి బొల్తా కొట్టించే బ్యాచ్ ఒకటైతే.. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లు పెడుతూ.. ప్రజలను మోసం చేస్తున్నది మరో బ్యాచ్. అలాంటి ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన ఘటన ఒకటి బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. వంద రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించి.. అక్షరాల రూ. 77 వేలను […]

రూ.100 రిఫండ్‌కు ఫోన్ కొట్టి.. వేల రూపాయలు పొగొట్టుకున్నాడు..!
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 9:17 PM

ఈ హైటెక్ యుగంలో మోసాలు కూడా హైటెక్‌గానే ఉంటున్నాయి. ఒక్క ఫోన్ కాల్‌తో డబ్బులు కూడా పొగుట్టుకుంటున్నారు బాధితులు. సాధారణంగా ఏటీఎం కార్డుల వివరాల గురించి ట్రాప్ చేసి బొల్తా కొట్టించే బ్యాచ్ ఒకటైతే.. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లు పెడుతూ.. ప్రజలను మోసం చేస్తున్నది మరో బ్యాచ్. అలాంటి ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన ఘటన ఒకటి బీహార్‌లో వెలుగులోకి వచ్చింది.

వంద రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించి.. అక్షరాల రూ. 77 వేలను పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. పట్నాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. విష్ణు అనే ఓ ఇంజినీర్‌ సెప్టెంబరు 10న ఆన్‌లైన్ ఫుడ్ ఆప్ జొమాటోలో ఓ ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే డెలవరీ బాయ్ వచ్చి ఆర్డర్ ఇచ్చిన ఐటమ్‌ను విష్ణుకు అందజేశాడు. అయితే ఫుడ్ బాగులేకపోవడంతో విసుగు చెందిన విష్ణు.. రిటర్న్ తీసుకెళ్లమని డెలివరీ చేసిన బాయ్‌ను కోరాడు. ఇందుకు తిరస్కరించిన ఆ బాయ్.. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయమంటూ సలహా ఇచ్చాడు.

డెలివరీ బాయ్ సలహాతో జోమాటో కస్టమర్ కేర్ కోసం గూగుల్‌లో సర్చ్ చేశాడు. దీంతో అతడికి టాప్‌లో ఓ కస్టమర్ కేర్ నంబర్ కనిపించింది. దీంతో అదే నిజమైన నంబర్ అనుకుని కాల్ చేశాడు. అయితే నిజానికి అది జోమాటో కస్టమర్ కేర్ నంబర్ కాదు. ఈ విషయం తెలియని బాధితుడు విష్ణు ఆ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అయితే అవతలి వ్యక్తి కూడా.. తాను జొమాటో కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ అని, ఫుడ్ బాగాలేనందుకు రూ.100 రీఫండ్‌ ఇస్తామని చెప్పాడు. అయితే ఇందుకోసం రూ.10 డిపాజిట్‌ చేయాలని అన్నాడు. అనంతరం ఆ వ్యక్తి బాధితుడి విష్ణు నంబరుకు ఓ లింక్‌ పంపాడు. ఆ లింక్‌ క్లిక్ చేసి.. విష్ణు తన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.10 జమ చేశాడు. అయితే కాసేపటికే విష్ణు ఖాతా నుంచి పలు దఫాలుగా రూ.77వేలు మాయమయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన విష్ణు.. పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సైబర్‌ కేసు నమోదు చేశారు. ఆప్‌లో ఉన్న నంబర్లు కాకుండా ఇలా గూగుల్‌లో ఉన్న నంబర్లను పరీశిలించకుండా చేస్తే.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారని.. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..