కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది..?

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆర్నెళ్లు కూడా గడవలేదు.. అంతలోనే దేశంలో మరో మినీ సంగ్రామం మొదలైంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అంతేకాదు.. మరిన్ని రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. అయితే మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీనే. మరి ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కమల దళం వికసించనుందా..? లేదా.. ప్రతిపక్షాలు అధికారాన్ని కైవసం […]

కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది..?
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 10:03 PM

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆర్నెళ్లు కూడా గడవలేదు.. అంతలోనే దేశంలో మరో మినీ సంగ్రామం మొదలైంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అంతేకాదు.. మరిన్ని రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. అయితే మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీనే. మరి ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కమల దళం వికసించనుందా..? లేదా.. ప్రతిపక్షాలు అధికారాన్ని కైవసం చేసుకోనున్నాయా.. అన్నది దేశ వ్యాప్తంగా ఉత్కంఠకు తెరలేపాయి.

దేశ రాజధానికి సరిహద్దుల్లో ఉండే హర్యానాపై ఇప్పుడు అందరి చూపు మళ్లింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ వచ్చే నెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాలు, 33.2 శాతం ఓట్లు సాధించి అధికారాన్ని అందుకుంది. అయితే ఈ సారి ఏకంగా 75 స్థానాలను దక్కించుకుని.. 2014 సీన్‌ను రిపీట్ చేసేందుకు కమల దళం కృత నిశ్చయంతో ఉంది. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ కలిసి పోటీ చేయగా.. ఇప్పుడు మాత్రం ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే అటు కాంగ్రెస్ కూడా ఏ విధంగానైనా హర్యానాలో పాగా వెయ్యాలని ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే మానిఫెస్టోను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అయిదేళ్ల పరిపాలన సజావుగానే కొనసాగుతోంది. అయితే సీఎం మనోహర్ లాల్ కొన్ని అనవసర విషయాల్లో వార్తల్లో నిలిచారు. అయితే అవన్నీ.. సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం చూపలేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శిరోమణి అకాలీ దళ్‌తో కలిసి.. 10 లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేశారు. దీంతో అదే జోష్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూపాలన్న పట్టుదలతో మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. ఇటీవల ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఎక్కువ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. అయితే జేపీ నడ్డాది కూడా పొరుగు రాష్ట్రమే అవ్వడం.. హర్యానా రాజకీయాలపై అవగాహన ఉండటం.. బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది.

అయితే గత ఎన్నికల్లో 18 స్థానాలు, 24.1 ఓట్ల శాతం సాధించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది. కీలకమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన పార్టీ సారథి అభయ్ సింగ్ చౌతాలాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టుంది. పార్టీ ప్రధాన మద్దతుదారుల్లో జాట్‌లు ఒకరు. 2014 ఎన్నికల వరకూ భూపేందర్ సింగ్ హుడా సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. నాటి ఎన్నికల్లో హుడా సారథ్యంలోనే పోరాడిన కాంగ్రెస్ 17 స్థానాలు, 20.6 శాతం ఓట్లతో మూడోస్థానానికే పరిమితమైంది. మళ్లీ ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలు ఎదుర్కొననుంది. అయితే ప్రీ పోల్ సర్వేలో మాత్రం బీజేపీకే సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 10 లోక్‌సభ స్థానాల్లో ఎంపీలు ఉండటం.. కేంద్రంలో బీజేపీ హవా.. ఇటు పొరుగు రాష్ట్రంలోనే జాతీయ కార్యాధ్యక్షుడు జేపీ నడ్డా ఉండటం.. బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ప్రజా తీర్పు వ్యతిరేకంగా వస్తే.. అది బీజేపీకి కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు హర్యానా రిజల్ట్ ఆ రాష్ట్రాల మీద పడుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రజా తీర్పు ఏలా ఉండబోతుందన్నది మరో నెల రోజులు వేచి చూస్తే.. తేలనుంది.