Part-time job Scam: సైబర్ కేటుగాళ్ల వలలో గృహిణులు.. ఇంట్లోనే ఉంటూ సంపాదన అంటూ ఎర..
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జాబ్ స్కామ్ కలకలం రేపుతోంది. పార్క్ టైం జాబ్‌ల పేరిట గృహిణులు, నిరుద్యోగ యువతకు వల వేసి కుచ్చుటోపీ పెడుతున్నారు. భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడిగా పెట్టమని నమ్మబలికి.. ఆనక ముఖం చాటేస్తున్నారు. పూణెకు చెందిన..
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జాబ్ స్కామ్ కలకలం రేపుతోంది. పార్క్ టైం జాబ్‌ల పేరిట గృహిణులు, నిరుద్యోగ యువతకు వల వేసి కుచ్చుటోపీ పెడుతున్నారు. భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడిగా పెట్టమని నమ్మబలికి.. ఆనక ముఖం చాటేస్తున్నారు. పూణెకు చెందిన ఓ మహిళకు పార్ట్ టైం జాబ్ ‘లైక్ వీడియో అండ్ ఎర్న్’ పేరిట ఇంటి నుంచే ఉద్యోగం చేసుకోవచ్చని ఆమె మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. కొన్ని వీడియో లింక్‌లను పంపి వాటికి లైక్ బటన్ నొక్కితే చాలని.. అలా చేయడం వల్ల రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పైగా పంపాదించుకోవచ్చనేది దాని సారాంశం. తొలుత ఆమెను నమ్మించడానికి వీడియో లింక్‌లలో లైక్ కొట్టినందుకు స్కామర్లు డబ్బును ఆమె ఖాతాలో జమ చేసేవారు.
ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే 30 శాతం ఆదాయం అర్జించవ్చని కేటుగాళ్లు సూచించడంతో ఆమె రూ.12 వేలు యూపీఐ ద్వారా పంపింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే రూ.16 వేలు అర్జించింది. ఎక్కువ ఆదాయం కోసం రెండు వేరువేరు బ్యాంకు ఖాతాలకు రూ.24 లక్షలు పంపించింది. ఐతే ఈసారి తాను మోసపోయానని గ్రహించి.. తన డబ్బును తిరిగి తన ఖాతాకు పంపించవల్సిందిగా కోరింది. ఐతే స్కామర్లు అందుకు అదనంగా రూ.30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆన్‌లైన్ స్కామ్ పడినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
గచ్చిబౌలికి చెందిన ఓ యోగా శిక్షకురాలికి ఫోన్ వచ్చింది. ఆమె సమయం, ఫీజు తదితర వివరాలు తెలిపింది. అడ్వాన్స్ చెల్లిస్తామని శిక్షకురాలి బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్ కార్డు వివరాలను సైబర్ నేరస్తులు తీసుకున్నారు. నిర్ధారణ కోసం ఫోన్ పే ద్వారా తాము పంపిన లింక్‌కు రూ.10 చెల్లిమని కోరారు. ఆ తర్వాత అడ్వాన్స్ పంపిస్తామని కేటుగాళ్లు సూచించారు. నిజమేనని నమ్మిన ఆమె నగదు బదిలీ చేయగానే క్షణాల్లో ఆమె ఖాతాలోని డబ్బు ఖాళీ అయిపోయింది. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.లక్షల్లో సంపాదించుకోండి అంటూ సైబర్ నేరస్తుల వలలో గృహిణులు చేతిలోని సొమ్ము, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదునూ పోగొట్టుకుంటున్నారు. ట్యూషన్లు, మ్యూజిక్, పెట్టుబడులు తదితర అంశాలను నగర మహిళలకు ఆశగా చూపి సైబర్ నేరస్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దీంతో మాయగాళ్ల వలకు చిక్కి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. ఇలా కేవలం నెలల వ్యవధిలోనే అనేక మంది గృహిణులు కోట్లలో డబ్బు పోగొట్టుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చే గుర్తు తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని, మెసేజ్‌లు, ఇతర ప్రకటనలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.