బ్రేకింగ్.. మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్..ఉదయం నుంచి రెండో సారి..
పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఉదయం నౌగాం సెక్టార్ మీదుగా భారత ఔట్ పోస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. అయితే పాక్ కాల్పులకు ధీటుగా భారత్ సమాదానం చెప్పింది.

పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఉదయం నౌగాం సెక్టార్ మీదుగా భారత ఔట్ పోస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. అయితే పాక్ కాల్పులకు ధీటుగా భారత్ సమాదానం చెప్పింది. అయితే మరోసారి సాయంత్రం తన వక్రబుద్దిని ప్రదర్శించింది. సుందర్బానీ సెక్టార్ మీదుగా మరోసారి భారత సైన్యాన్నిటార్గెట్ చేస్తూ కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన సైన్యం పాక్ రేంజర్లకు భారత జవాన్లు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. గత కొద్ది రోజులుగా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. అదే సమయంలో ఉగ్రవాదుల్ని దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోంది పాక్.



