AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీ బస్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. డిపో మూసివేత..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో ఆర్టీసీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా

ఆర్టీసీ బస్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. డిపో మూసివేత..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2020 | 8:55 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో ఆర్టీసీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కేఎస్‌ఆర్‌టీసీలో కలకలం రేగింది. ప్రజా రవాణా పునరుద్ధణలో భాగంగా జిల్లాల మధ్య కేఎస్‌ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.

ఈ క్రమంలో.. పప్పనమ్‌కొడె బస్ డిపోలో విధులు నిర్వహిస్తున్న 40 ఏళ్ల వయసున్న బస్సు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తీవ్ర జ్వరం రావడంతో ఆయనను ఆదివారం ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయగా పాజిటివ్‌‌గా తేలింది. దీంతో.. ఆ డిపోలో పనిచేస్తున్న 50 మంది ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించారు. ఐదు రోజుల్లో వారందరికీ కరోనా పరీక్షలు చేస్తామని వైద్యాధికారులు తెలిపారు. పప్పనంకొడె బస్ డిపోను మూసివేశారు.

Also Read: 20 కోట్ల మొక్కలు లక్ష్యంగా.. తెలంగాణకు హరితహారం