కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన గవర్నర్ తమిళిసై, కేటీఆర్
కల్నల్ సంతోష్ బాబు భౌతికకాయం సాయంత్రం హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. కల్నల్ సంతోష్ బాబు భౌతిక ఖాయానికి గవర్నర్ తమిళిసై, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు.

సోమవారం రాత్రి లదాఖ్‌లోని గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న భారత్-చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఇరవై మంది జవాన్లు వీరమరణం పోందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. అతడి భౌతికకాయం సాయంత్రం హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. కల్నల్ సంతోష్ బాబు భౌతిక ఖాయానికి గవర్నర్ తమిళిసై, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు, పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు.
హకీంపేట్‌లో ఆర్మీ సైనిక వందనం సమర్పించిన తర్వాత.. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా.. ఆయన పార్థివ దేహాన్ని సూర్యపేటలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లనున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు గురువారం ఉదయం అధికారిక లాంచనాలతో జరగనున్నాయి.



