ఆ దేశ ముస్లింలను తరమాల్సిందేనంటున్న కాంగ్రెస్ మిత్రపక్షం..!

ఓ వైపు దేశవ్యాప్తంగా.. విపక్షాలు, ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా.. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీఎంసీ, టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. శివసేన మాత్రం సీఏఏతో పాటుగా ఎన్నార్సీని కూడా అమలు చేసి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన ముస్లింలను దేశం నుంచి తరిమేయాల్సిందేనంటూ ప్రకటించింది. శివసేన పార్టీకి […]

ఆ దేశ ముస్లింలను తరమాల్సిందేనంటున్న కాంగ్రెస్ మిత్రపక్షం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 25, 2020 | 9:49 PM

ఓ వైపు దేశవ్యాప్తంగా.. విపక్షాలు, ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా.. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీఎంసీ, టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. శివసేన మాత్రం సీఏఏతో పాటుగా ఎన్నార్సీని కూడా అమలు చేసి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన ముస్లింలను దేశం నుంచి తరిమేయాల్సిందేనంటూ ప్రకటించింది. శివసేన పార్టీకి చెందిన అధికారిక పత్రిక సామ్నాలో దీనికి సంబంధించిన కథనం ప్రచురించింది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టంలో లోపాలున్నాయంటూ వేలెత్తి చూపుతూనే.. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది.

పాక్, బంగ్లాకు చెందిన ముస్లింలను దేశం నుంచి పంపించాల్సిందేనని.. అందులో ఎలాంటి సదేహం లేదని ఆ పత్రికలో పేర్కొంది. ఇక శివసేన పార్టీ జెండా ఎప్పటికీ కాషాయ రంగులోనే ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు హిందుత్వ కోసం శివసేన ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని.. అయితే కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ చట్టంలో కొన్ని లోపాలున్నాయంటూ పేర్కొంది. ఈ సందర్భంగా అటు పార్టీ జెండా రంగును మార్చుకున్న మహానరాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్)పై నిప్పులు చెరిగింది. బీజేపీ డైరక్షన్‌లో ఎంఎన్ఎస్ నడుస్తోందని.. బీజేపీ లాగే కేవలం ఓట్ల కోసమే జెండా రంగును కాషాయం చేసుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం వరకు సీఏఏకి వ్యతిరేకంగా మాట్లాడిన రాజ్‌థాక్రే.. ఇప్పుడు ఓట్ల కోసం పార్టీ జెండా రంగులు మార్చారంటూ విరుచుకుపడింది. కాగా, సీఏఏలో ఉన్న లోపాలతో ముస్లింలే కాకుండా.. కొందరు హిందువులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందంటూ పేర్కొనడం గమనార్హం.