మాస్కులు ధరించనందుకు 22 లక్షల మందికి జరిమానా.. 44 కోట్ల రూపాయలు వసూలు చేసిన బీఎంసీ..

Bombay Municipal Corporation : మాస్కులు ధరించనందుకు ముంబైలో 22 లక్షల మందికి పైగా జరిమానా విధించారు. బొంబే మునిసిపల్‌ కార్పొరేషన్, సివిల్‌ పోలీసులు, రైల్వే అధికారులు

మాస్కులు ధరించనందుకు 22 లక్షల మందికి జరిమానా.. 44 కోట్ల రూపాయలు వసూలు చేసిన బీఎంసీ..
Bombay Municipal Corporatio
Follow us

|

Updated on: Mar 22, 2021 | 8:28 AM

Bombay Municipal Corporation : మాస్కులు ధరించనందుకు ముంబైలో 22 లక్షల మందికి పైగా జరిమానా విధించారు. బొంబే మునిసిపల్‌ కార్పొరేషన్, సివిల్‌ పోలీసులు, రైల్వే అధికారులు మూకుమ్మడిగా ఈ ఫైన్‌లు విధించారు. అయితే ఈ మూడు ఏజెన్సీలు కలిపి వసూలు చేసిన ఫైన్లు రూ.44.5 కోట్లు దాటింది. మార్చి 20న బీఎంసీ 1412 మందికి జరిమానా విధించగా.. సుమారు రూ.28 లక్షలు వసూలు చేసింది. ముంబై పోలీసులు 6789 మందికి జరిమానా విధించగా రూ.53.5 లక్షలు వసూలు చేసింది. రైల్వే 489 మందికి జరిమానా విధించగా రూ. 97000లను వసూలు చేసింది. నగరంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో బీఎంసీ తన డ్రైవ్‌ను ముమ్మరం చేసింది. చాలామంది ప్రజలు మాస్కులు ధరించకుండా బయట తిరుగుతుండటంతో ఫైన్లు వేయాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది.

ఈ విషయంలో బీఎంసీ మేయర్‌ కిషోరి పెడ్నేకర్‌ గత నెలలో మాస్కులు ధరించని వారికి జరిమానా విధించవద్దని తెలిపారు. బీఎంసీ అధికారులు ప్రజలతో తప్పుగా ప్రవర్తించవద్దని కోరారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే పొటో, వీడియో తీసి బీఎంసీ అధికారులకు నివేదించాలని సూచించారు. ఎందుకంటే నిరంతర ఆంక్షలతో ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు. వాటిని అర్థం చేసుకొని అధికారులు ప్రవర్తించాలన్నారు. ఫైన్లు వేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మన లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు మాస్కులు ధరించేలా చేయడం మాత్రమే అని గుర్తించాలి.

Telangana News: తేనె తుట్టెకు పొగబెట్టాలనుకున్నాడు.. తానే బుగ్గిగా మారిపోయాడు.. విషాదం

EC Green Signal to PRC : ప్రభుత్వ ఉద్యోగులకు లైన్ క్లియర్, పీఆర్సీ అనౌన్స్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈసీ

Jr NTR : ఆడియో ఫంక్షన్‌లో కూడా ‘సీఎం.. సీఎం’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు.. తారక్ ఎలా రెస్పాండ్ అయ్యాడంటే

NCR Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో.. రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండా ఎంపిక