Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR : ఆడియో ఫంక్షన్‌లో కూడా ‘సీఎం.. సీఎం’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు.. తారక్ ఎలా రెస్పాండ్ అయ్యాడంటే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన నటనతో, అదిరిపోయే డ్యాన్స్ లతో అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు...

Jr NTR : ఆడియో ఫంక్షన్‌లో కూడా 'సీఎం.. సీఎం' అంటూ ఫ్యాన్స్ నినాదాలు.. తారక్ ఎలా రెస్పాండ్ అయ్యాడంటే
jr ntr
Follow us
Rajeev Rayala

| Edited By: Team Veegam

Updated on: Mar 22, 2021 | 11:31 AM

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన నటనతో, అదిరిపోయే డ్యాన్స్ లతో అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తారక్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో తారక్ క్రేజ్ ఫ్యాన్ ఇండియా రేంజ్‌లో వెళ్లనుందన్న టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే తారక్ రాజకీయాల్లోకి రావాలని కొంత మంది అభిమానులు కోరుకుంటున్నారు. నటసార్వభౌమ తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం బాధ్యతలను తారక్ తీసుకోవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.

ఇక గతంలోను తెలుగు దేశం తరపున ఎన్టీఆర్ ప్రచారం కూడా నిర్వహించారు. ఈ క్రమంలో తారక్ రాజకీయాల్లోకి వస్తారని అంతా అనుకున్నారు కానీ ఆయన తన మద్దతు మాత్రమే తెలిపారు. ఇప్పడు తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. తన సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే కొందరు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు మాత్రం తారక్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు తారక్ ను రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు అని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసు అంటూ దాటేసారు ఎన్టీఆర్. తాజాగా కీరవాణి కుమారుడు శ్రీసింహ హీరోగా నటిస్తున్న తెల్లవారితే గురువారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. అయితే అదే సమాయంలో అక్కడున్న అభిమానులు తారక్ ప్రసంగిస్తుండగా… సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పడ్డాడు. సీఎం సీఎం అని అరుస్తున్న సమయంలో చెప్పేది వినండి, స్టాప్ అని చెప్పాగా బ్రదర్ అంటూ సర్దిచెప్పాడు తారక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rang De Movie Pre Release Event LIVE : రంగ్ దే సినిమాతో సందడి చేయడానికి సిద్దమవుతున్న నితిన్.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్.. (video)

Vakeel Saab: వకీల్ సాబ్‌‌కి ముందుగా అనుకున్న ఇంట్రస్టింగ్ టైటిల్ ఏంటో తెలుసా..? గెస్ చేయగలరా