Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vakeel Saab: వకీల్ సాబ్‌‌కి ముందుగా అనుకున్న ఇంట్రస్టింగ్ టైటిల్ ఏంటో తెలుసా..? గెస్ చేయగలరా

ఈ మధ్య సినిమా ప్రమోషన్లు సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరగుతున్నాయి. ఫిలిం స్టార్స్ అంతా తమ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కావాల్సినంత...

Vakeel Saab: వకీల్ సాబ్‌‌కి ముందుగా అనుకున్న ఇంట్రస్టింగ్ టైటిల్ ఏంటో తెలుసా..? గెస్ చేయగలరా
Vakeel Saab
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 21, 2021 | 7:23 PM

Pawan Kalyan:  ఈ మధ్య సినిమా ప్రమోషన్లు సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరగుతున్నాయి. ఫిలిం స్టార్స్ అంతా తమ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కావాల్సినంత పబ్లిసిటీ చేసేసుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియా ఆర్మీని పెంచుకునేందుకు కూడా పోటిలు పడుతున్నారు స్టార్స్. కానీ లిస్ట్‌లో పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ మాత్రం కనిపించటం లేదు. పాలిటిక్స్‌, సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన కల్యాణ్‌…తన సోషల్ మీడియా స్ట్రెంగ్త్ మాత్రం ఓన్లీ ఫర్ పాలిటిక్స్ అంటున్నారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న పవన్‌ ఏ ఒక్క సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయటం లేదు. దీంతో సినిమాలు డిజిటల్‌ రికార్డ్స్ విషయంలో వెనకబడిపోతున్నాయని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్‌.

ట్విటర్‌లో పవన్‌ కల్యాన్‌కు 4 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. పవన్‌ ఒక్క ట్వీట్ చేస్తే చాలు అది క్షణాల్లో నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్ అవుతుంది. కానీ పవన్‌ మాత్రం పొలిటికల్ ఇష్యూస్‌ మీద తప్ప సినిమాల గురించి ఒక్క ట్వీట్ కూడా చేయటంలేదు.. మరి రిలీజ్ టైంలో అయినా పవన్‌.. సినిమా అప్‌డేట్స్ షేర్ చేస్తారేమో చూడాలి.

తాజాగా ఈ చిత్ర టీమ్ ప్రమోషన్ ప్రారంభించింది. అందులో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఈ చిత్ర టైటిల్ గురించి మాట్లాడుతూ తాము ముందు “వకీల్ సాబ్” టైటిల్ కన్ఫామ్ చేయలేదని..  మూవీ స్టోరీ లైన్‌కు తగ్గట్టుగా “మగువ” అనే టైటిల్‌ను పరిశీలించినట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఆ సినిమాకు “వకీల్ సాబ్” అని పేరును ఫైనల్ చేసినట్లు వెల్లడించారు.

Also Read:  Vizag Crime News: గుడిలో చోరి చేశారు.. సాంతం కొల్లగొట్టారు.. చివర్లో సీసీ ఫుటేజ్ ఉండే రూమ్‌కి వెళ్లి..

Mongoose Vs Cobra: కింగ్ కోబ్రాను ఒక్క నిమిషంలో ఖతం చేసింది.. ఈ ముంగిస స్కిల్స్ అదుర్స్…