Vizag Crime News: గుడిలో చోరి చేశారు.. సాంతం కొల్లగొట్టారు.. చివర్లో సీసీ ఫుటేజ్ ఉండే రూమ్‌కి వెళ్లి..

సీసీకెమెరాలున్నాయి.. సెక్యూరిటీ గార్డూ ఉన్నాడు.. అయినా చోరీ జరిగింది. అవును విశాఖపట్నం పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ ఆలయంలో జరిగిన దొంగతనం..

Vizag Crime News: గుడిలో చోరి చేశారు.. సాంతం కొల్లగొట్టారు.. చివర్లో సీసీ ఫుటేజ్ ఉండే రూమ్‌కి వెళ్లి..
Theft At Temple
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 21, 2021 | 6:17 PM

సీసీకెమెరాలున్నాయి.. సెక్యూరిటీ గార్డూ ఉన్నాడు.. అయినా చోరీ జరిగింది. అవును విశాఖపట్నం పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ ఆలయంలో జరిగిన దొంగతనం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. అర్ధరాత్రి జరిగిన ఈ చోరీ వెనుక పక్కా ప్లాన్‌ ఉందన్న ప్రచారం సాగుతోంది.

తాళాలు పగలగొట్టి మరీ ఆలయంలోకి చొరబడ్డారు దుండగులు. గర్భాలయంలో ఉన్న హుండితో పాటు బంగారు నగలను దాచే బీరువాను కూడా కొల్లగొట్టారు. ఆ తర్వాత సీసీ కెమెరాల ఫుటేజీని భద్రపరిచే ఆఫీస్‌రూంలోకి వెళ్లి.. DVRను కూడా తమ వెంట తీసుకెళ్లారు. నైట్‌టైంలో సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. అతను అర్దరాత్రి సమయంలో వాష్‌రూంకు వెళ్లినట్టుగా చెబుతున్నాడు. కానీ జరిగిన దొంగతనం చూస్తే అరగంటకుపైగానే దుండగులు ఆలయంలో ఉన్నట్టు అర్దమవుతోంది. అంటే.. సెక్యూరిటీ గార్డు అంత సేపు ఎటు వెళ్లాడు.. ఏం చేశాడు. నిజంగానే అతనికి దొంగతనం గురించి తెలియదా లేక.. ఇంకా ఏదైనా జరిగిందా అన్నది పోలీసులు తేల్చేపనిలో పడ్డారు.

ఖచ్చితంగా తెలిసిన వారి పాత్ర ఉండే ఉంటుందన్న అనుమానం రేకెత్తుతోంది. దొంగతనం చేసిన దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా.. చాలా జాగ్రత్త పడ్డారు. వచ్చేనెలలోనే అమ్మవారి మహోత్సవాలు చేసేందుకు సమాయత్తం అవుతున్న క్రమంలో ఈ దొంగతనం జరగడం.. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. కాగా ఈ మధ్యకాలంలో ఇలా ఆలయాల్లో దొంగతనాలు చేసే కేటుగాళ్లు పెరిగిపోయారు. అంతరాష్ట్ర గ్యాంగులు ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దొంగల పాత్రపై కూడా విచారణ సాగిస్తున్నారు.

Also Read:  Mongoose Vs Cobra: కింగ్ కోబ్రాను ఒక్క నిమిషంలో ఖతం చేసింది.. ఈ ముంగిస స్కిల్స్ అదుర్స్…

పెళ్లి అయిన 5 రోజుల తర్వాత అత్త కొడుకుతో నవవధువు జంప్.. పాపం ఆ పెళ్లికొడుకు ఇప్పటికి కూడా..