Cultivation of the opium poppy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గసగసాల సాగుపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్
మత్తు పంట ఇప్పుడు తెంగాణలోనూ దుమ్ము రేపుతోంది. తవ్వుతున్నా కొద్దీ మట్టే అన్నట్టుగా.. ఈ దందాపై సోధిస్తున్న కొద్దీ.. కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతకు ఈ ముఠాలు ఎక్కడివి?...
మత్తు పంట ఇప్పుడు తెంగాణలోనూ దుమ్ము రేపుతోంది. తవ్వుతున్నా కొద్దీ మట్టే అన్నట్టుగా.. ఈ దందాపై సోధిస్తున్న కొద్దీ.. కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతకు ఈ ముఠాలు ఎక్కడివి? ఎక్కడి నుంచి ఈ దందాను సాగిస్తున్నాయి? అంతర్జాతీయ లింక్స్ ఏమైనా ఉన్నాయా ? ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ సరుకు వెళ్తుంది? ఎవరెవరు దీని వెనుకాల ఉన్నారు? అమాయక రైతులకు ఈ పంట సీడ్స్ ఎవరు తెచ్చిస్తున్నారు? ఏ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి పంట సాగు చేస్తున్నారు? తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
డైరెక్షన్ బెంగళూరు. స్ర్కీప్ట్ చిత్తూరులో. సినిమా షూటింగ్ తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఇలా తీగ లాగితే మదనపల్లి టు హైదరాబాద్.. డొంక కదులుతోంది. అది ఎక్కడో కాదు.. హైటెక్ సిటీ శివారులో గసగసాల సాగు బట్టబయలైంది. ఈ డ్రగ్స్ వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది. అధికారవర్గాలను షాక్‌కు గురిచేసింది. అసలు గసగసాలు ముసుగు లో సీక్రెట్ గా ఓపియం పంట ను ఎలా పండిస్తున్నారు? ఎవరి అండతో చూసుకొని ఈ నిషేధిత పంట ను సాగు చేస్తున్నారు? లేమురు కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ దందా పై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్‌తో మీ ముందుకు వచ్చింది. మొన్నటి వరకు మదనపల్లి మారుమోగింది. ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది. హైదరాబాద్ శివారులోని కందుకూరు మండలం లేమూరు గ్రామం. ఇప్పుడు ఇది గసగసాల పంట సాగుతో ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు చెందిన దండుపల్లి చెన్నకేశవులు ఈ పంటను సాగు చేస్తున్నాడు.
నిందితుడు 15 ఎకరాలు లీజుకు తీసుకొని.. మామిడి, జామ తోటల సాగు పేరుతో.. ఓపీఎం పోప్పీని పండిస్తున్నాడు. ఇక్కడి డ్రగ్స్‌ను కర్నాటక బెంగళూరు సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇటీవల ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో టీవీ9 బట్టబయలు చేసి.. గసగసాల పంటను సాగు ఇష్యూ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని వెనుకాల ఒక్కోక్కటిగా బండారం బట్టబయలు అవుతోంది. అదే తరహాలో చెన్నకేశవులు యవ్వారాన్ని బయటపెట్టాడు వెంకటరమణ. ఇంతకు ఈ గసగసాల మెుక్కకు మెుదట ఆకర్షణీయమైన రంగులో పూలు పూస్తాయి. పువ్వు మధ్యభాగంలో పిందె ఉంటుది. పిందె పెరిగి కాయగా మారుతున్న సమయంలో పువ్వు రేకులు రాలిపోయి కాయ మాత్రమే మిగులుతుంది. గుండ్రంగా లేత ఆకుపచ్చ రంగులో ఉండే ఈ కాయ లోపల గసగసాలు ఉంటాయి. ఈ కాయల నుంచి చిక్కనైన తెల్లటి ద్రవం కారుతుంది. లేటెక్స్ వంటి ఈ లిక్విడ్ బయటకు వచ్చిన వెంటనే బంకలాగా గట్టిపడి కాయలపైనే ఉండిపోతుంది. ఇది ఆరిన తరువాత మరుసటి రోజుకు ఈ పదార్థం ముదురు గోధుమ రంగు లోనికి మారుతుంది. ఆలా రంగు మారిన తరువాత కాయ లో నుండి తీసిని జిగురు, గసాగసాల తో ప్రమాదకరమైన డ్రగ్స్ తయారు అవుతాయి.
ఇది ఒక్క ఏపీ, తెలంగాణకే పరిమితం కాలేదు. ఎందుకంటే.. దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మాఫియా గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తోంది. ఇప్పుడు ఈ బండారం బయట పడడంతో పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో ఉన్న అనుమతిని సాకుగా చూపి.. రైతులను బలి పశువులు చేస్తున్నాయి డ్రగ్ ముఠాలు.
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రం దీని సాగుకు అధికారికంగా అనుమతిస్తోంది. ఈ పంట సాగు చేయాలంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కొటిక్స్ జారీ చేసే లైసెన్స్ తప్పనిసరి. ఎన్నో ఆంక్షలు, అధికారుల తనిఖీలు, పర్యవేక్షణలో దీనిని సాగు చేయవలసి ఉంటుంది. దిగుబడి మెుత్తాన్ని తప్పనిసరిగా సీబీఎన్ ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే అమ్మాలి. దేశంలో ఎవరైనా ఎక్కడైనా అనుమతి లేకుండా ఓపియం పాపీ సాగుచేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా అది తీవ్రమైన నేరమవుతుంది. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టం ప్రకారం కఠినమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. దోషులుగా తేలితే పది సంవత్సరాలకు పైగా జైలుశిక్ష, లక్షన్నర వరకు జరిమానా విధిస్తారు.
గసగసాల ముసుగులో సీక్రెట్ గా మత్తు పంట పండిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మదనపల్లిలో పట్టుబడ్డ వెంకటరమణ సహకారం తో మరికొంత మంది ఈ పంట ను సాగు చేస్తున్నారని పోలీసులు అనునిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఫార్మ్ ల్యాండ్స్ ని లీజ్ తీసుకొని అంతర్ పంట గా సాగు చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా వెంకటరమణ చెన్నకేశవులు నెట్వర్క్ పై దృష్టి పెట్టారు పోలీసులు. వీరికి ఉన్న పరిచయాలు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా దర్యాప్తు ను వేగవంతం చేసే ఛాన్స్ ఉంది. మదనపల్లి లో పట్టుబడిన తర్వాత చెన్నకేశవులు ఎలా అలెర్ట్ అయ్యాడు. పోలీసుల కళ్ళు గప్పేందుకు పంటను ఎలా ధ్వంసం చేశారు.
Also Read: పెళ్లి అయిన 5 రోజుల తర్వాత అత్త కొడుకుతో నవవధువు జంప్.. పాపం ఆ పెళ్లికొడుకు ఇప్పటికి కూడా..