Thellavarithe Guruvaram Pre Release Event Highlights : తెల్లవారితే గురువారం అంటున్న శ్రీ సింహా.. గెస్టులుగా తారక్, జక్కన్న
Thellavarithe Guruvaram movie event: ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తనయుడు, యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడు, యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఈ యంగ్ హీరో తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో గుర్తింపు తెచ్చుకున్నాడు

Thellavarithe Guruvaram : ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తనయుడు, యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడు, యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఈ యంగ్ హీరో తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా నటనకు ప్రాధాన్యత కలిగిన చిన్న సినిమాలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. మొదటి సినిమానే అయినా నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే తెల్లవారితే గురువారం అనే సినిమా చేస్తున్నాడు. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాల భైరవ సంగీతమందిస్తున్నాడు.మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
తెల్లవారితే గురువారం లైవ్ ఇక్కడ చూడండి :
LIVE NEWS & UPDATES
-
నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ఎందుకో టెన్షన్ గా ఉంది : తారక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ఎందుకో టెన్షన్ గా ఉంది అన్నాడు తారక్. రేపు నా పిల్లలు ఏదైనా సాధిస్తే నేను ఏం మాట్లాడలేను. ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది. నా తమ్ముళ్లు సింహ, భైరవ విజయం సాధిస్తే ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు అన్నారు. నా ప్రతి నిర్ణయం వెనుక అండగా ఉన్న ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం అన్నారు తారక్. ఈ సినిమా ఒక అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్న. సింహ, భైరవ మరో మెట్టు ఎక్కాలని కోరుకుంటున్న అన్నారు తారక్. అలాగే పిల్లలను పెంచే విషయం పై నేను నా భార్య ఇద్దరం ఎప్పుడు ఆలోచిస్తుంటాం. ఇప్పుడు సింహ, భైరవ విజయం వెనుక వల్లి గారు, రమా గారు అని తారక్ అన్నారు. సినిమా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు తారక్.
-
టీజర్ బాగుంది, పాటలు బాగున్నాయి, ఇక ట్రైలర్ చాలా చాలా బాగుంది : రాజమౌళి
దర్శక ధీరుడు జక్కన్న మాట్లాడుతూ.. టీజర్ బాగుంది, పాటలు బాగున్నాయి, ఇక ట్రైలర్ చాలా చాలా బాగుంది అని అన్నారు. సినిమా చాలా రిచ్ గా అనిపిస్తుంది. సినిమా తప్పకుండా మంచి విజయ్ సాధిస్తుంది అని జక్కన్న అన్నారు
-
-
సినిమాకోసం మీలాగే నేను ఎదురుచూస్తున్న : కీరవాణి
కీరవాణి మాట్లాడుతూ ఈవెంట్ కు వచ్చినందుకు తారక్ కు థాంక్స్ చెప్పిన కీరవాణి. అలాగే శ్రీసింహ, కాలభైరవ ఆల్ డి బెస్ట్ చెప్తూ.. ఈ సినిమా కథ కూడా నాకు తెలియదు. మీలాగే నేను సినిమా కోసం ఎదురుచూస్తున్న అని అన్నారు.
-
తెల్లవారితే గురువారం బిగ్ టికెట్ అందుకున్న తారక్
దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా తెల్లవారితే గురువారం సినిమా బిగ్ టికెట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
ఆకట్టుకుంటున్న తెల్లవారితే గురువారం ట్రైలర్..
ఆసక్తి రేకెత్తిస్తున్న తెల్లవారితే గురువారం సినిమా ట్రైలర్. సినిమాలో కావాల్సినంత కామెడీతో పాటు సెంటిమెట్స్ కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
-
-
హీరోని కథ చెప్పమని అడిగిన తారక్
హీరోని సినిమా కథను చెప్పమని అడిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెల్లవారితే గురువారం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తారక్
-
కీరవాణి , జక్కన్న కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలకరించిన తారక్
గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తారక్ కు చిత్రయూనిట్ కీరవాణి కుటుంబసభ్యులు, జక్కన ఘన స్వాగతం పలికారు. కీరవాణిని, రాజమౌళిని ఆప్యాయంగా హత్తుకున్న తారక్
-
గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
తెల్లవారితే గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్.. అరుపులు కేకలతో స్వాగతం పలికిన అభిమానులు
-
జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన కాలభైరవ
జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ.. ఆనందంతో కేకలు వేసిన అభిమానులు. దద్దరిల్లిన ప్రాంగణం
-
ఈవెంట్ కు హాజరైన కీరవాణి, రాజమౌళి కుటుంబసభ్యులు…
తెల్లవారితే గురువారం సినిమా పాటలతో ప్రారంభమైన ఈవెంట్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన కీరవాణి, రాజమౌళి కుటుంబసభ్యులు.
-
ఎన్టీఆర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు..
యంగ్ టైగర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు. తారక్ తారక్ అంటూ నినాదాలు చేస్తున్న అభిమానులు.
-
తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన దర్శక ధీరుడు రాజమౌళి
ప్రారంభమైన తెల్లవారితే గురువారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్.. హాజరైన జక్కన్న, కీరవాణి, శ్రీ సింహ, కాలభైరవ
Published On - Mar 21,2021 8:30 PM