Operation Ganga: ఆగని ఆపరేషన్‌ గంగ.. ఉక్రెయిన్‌ నుంచి ఎన్ని విమానాలు వస్తున్నాయో తెలుసా..

Operation Ganga: దేశం కాని దేశం.. 11రోజులుగా బాంబులు, మిస్సైళ్ళ మోత.. ఎటు వెళ్తే ఏం జరుగుతుందోనన్న భయం. ఉన్నచోటే ఉండలేరు..

Operation Ganga: ఆగని ఆపరేషన్‌ గంగ.. ఉక్రెయిన్‌ నుంచి ఎన్ని విమానాలు వస్తున్నాయో తెలుసా..
Operation Ganga
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 07, 2022 | 6:00 AM

Operation Ganga: దేశం కాని దేశం.. 11రోజులుగా బాంబులు, మిస్సైళ్ళ మోత.. ఎటు వెళ్తే ఏం జరుగుతుందోనన్న భయం. ఉన్నచోటే ఉండలేరు.. మరో చోటుకు కదల్లేరు. ఇదీ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి. ఇలాంటి విపత్కర సమయంలో.. భయం లేదు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు నిరాటంకంగా ఆపరేషన్‌ గంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఒక ఫ్లయిట్‌లో 154 మంది.. మరో ఫ్లయిట్‌లో 183 మంది.. రష్యా సైనిక దాడితో కకావికలమైన ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఈ పక్రియ దాదాపు తుదిదశకు చేరుకుంది. ఎప్పటికప్పుడు దేశ పౌరులను అప్రమత్తం చేస్తూ క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గంగను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఉక్రెయిన్‌ నుంచి అక్కడి సరిహద్దు దేశాలైన పోలండ్‌, హంగరీ, రొమేనియా, స్లోవేకియా నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తుండగా.. హంగరీలో ఈ తరలింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ఈ కార్యక్రమం కింద ఉక్రెయిన్ నుంచి మరో 154 మంది భారతీయ పౌరులతో కూడిన ప్రత్యేక విమానం.. స్లోవేకియాలోని కోసిస్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. మరో విమానంలో 183 మంది ఇండియన్స్‌ ప్రత్యేక విమానం హంగేరీలోని బుడాపెస్ట్ నుండి స్వేదేశానికి చేరుకున్నారు.

ఒక్కరోజే స్వదేశానికి 176మంది తెలుగు విద్యార్థులు.. మూడు ప్రత్యేక విమానాల్లో యుక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు. వీరికి ఏపీ, తెలంగాణ భవన్‌లలో వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. వచ్చిన కొద్దిగంటల్లోనే వారిని స్వస్థలాలకు పంపించేస్తున్నారు అధికారులు. ఈ ఒక్కరోజే, 176 మంది తెలుగు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. ఏపీ నుంచి 71 మంది, తెలంగాణ నుంచి 105 మంది విద్యార్థులు వచ్చారు. ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 612 మంది తెలంగాణ విద్యార్థులు ఇళ్లకు చేరుకున్నట్టు సమాచారం.

ఉక్రెయిన్‌ నుంచి15వేల మందికిపైగా భారతీయుల తరలింపు.. ఇప్పటివరకు దాదాపు 15వేల మందికి పైగా భారతీయులను ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి తరలించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆపరేషన్ గంగలో భాగంగా 75 విమానాల్లో భారతీయుల తరలింపు ప్రక్రియ చేపట్టగా.. ఇవాళ ఒక్క రోజు 13 విమానాల్లో 2,500 మంది ఇండియాకు తీసుకువచ్చారు. నిన్న ఒక్కరోజే 15 విమానాల్లో సుమారు 2,900 మంది సురక్షితంగా భారత్‌కు చేరుకున్నట్లు తెలిపింది. ఇవాళ ప్రమాద ఘంటికలు మోగిన ఖార్కివ్‌ నగరంలో ప్రస్తుతం భారతీయులెవరూ లేరని.. అందర్నీ తరలించామని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించడంతో.. భారతీయుల తరలింపునకు ఇదే మంచి తరుణమని భావిస్తోంది కేంద్రం. దీంతో, ఆపరేషన్‌ గంగను మరింత వేగవంతం చేసింది.

ఉక్రెయిన్‌, ఈస్టర్న్‌ స్టేట్స్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌.. యుక్రెయిన్ లోని యుద్ధ ప్రభావం ఉన్న ఈస్టర్న్ స్టేట్స్‌లో ఇంకా వేల మంది భారతీయులు చిక్కుకున్నారు. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల విషయంలో భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఆ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా తరలించేందుకు సురక్షితమైన కారిడార్‌ల ఏర్పాటు కోసం రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు తక్షణమే కాల్పులు విరమించాలని ఒత్తిడి తెస్తోంది. మరోవైపు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, షెల్టర్లలోనే ఉండాలని విద్యార్థులకు సూచించింది విదేశాంగ శాఖ. ఎవరూ అనవసరంగా రిస్క్‌ చేయొద్దని కోరింది. విద్యార్థులతో రాయబార కార్యాలయాలు నిరంతరం టచ్‌లో ఉంటున్నట్టు తెలిపింది.

ఉక్రెయిన్‌ బార్డర్‌ దాటిన 21వేల మంది భారతీయులు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను అక్కడి భారత రాయబార కార్యాలయం మరోసారి అప్రమత్తం చేసింది. ఏయే ప్రదేశాల్లో ఉండిపోయారో వెంటనే తెలపాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతమున్న ప్రాంతం, మొబైల్‌ నంబర్‌, పాస్‌పోర్టు నంబర్‌తో పాటు మరిన్ని వివరాలతో కూడిన దరఖాస్తును పూరించి వెంటనే తమకు తెలియజేయాలని స్పష్టం చేసింది. మొత్తంగా ఇప్పటివరకు 21వేల మంది ఉక్రెయిన్‌ సరిహద్దు దాటినట్లు తెలిపిన భారత విదేశాంగశాఖ తెలిపింది.. వీరిలో 19,920 మంది ఆల్‌రెడీ ఇండియాకు చేరుకున్నారని పేర్కొంది. ఇక పిసోచిన్‌, ఖార్కివ్‌ నగరాల నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా సరిహద్దు దేశాలకు తరలిస్తున్నప్పటికీ.. దాడుల తీవ్రత అధికంగా ఉన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన వారిని తరలించడం పెద్ద సవాలుగా మారినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, వారిని కూడా సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తామని స్పష్టం చేసింది.

Also read:

అమ్మాయిలకు గమనిక.. వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి..!

Eyesight: చిన్న వయసులోనే కళ్లు దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా..!

పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదు.. చెరువు గట్టుపై స్కూల్ బ్యాగ్స్.. ఇంతకీ వాళ్లు ఎక్కడికి వెళ్లారు..?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..