ప్రశాంత్ కిషోర్ ని మా ఎన్నికల వ్యూహకర్తగా నియమించబోం……ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ క్లారిటీ
కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీ గురించి ఈ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్ వివరిస్తూ.. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరూ చర్చించినట్టు తెలుస్తోందని, తన రాజకీయ అనుభవాలను ప్రశాంత్ కిషోర్ ..పవార్ తో షేర్ చేసుకుని ఉండవచ్చునని తెలిపారు. ఆయనను తన ఎన్నికల వ్యూహకర్తగా తాము నియమించుకోబోమన్నారు. అసలు ఈ అంశమే వారి చర్చల్లో ప్రస్తావనకు రాలేదని ఆయన చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపైకి వచ్చి బీజేపీని ఎదుర్కోవాలని పవార్ భావిస్తున్నారని, పటిష్టమైన పొలిటికల్ ఫ్రంట్ ని ఎర్పాటు చేయాలన్నది ఆయన ఉద్దేశమని మాలిక్ వెల్లడించారు. బహుశా యూపీలో జరగనున్న ఎన్నికల గురించి కూడా పవార్, ప్రశాంత్ కిషోర్ మధ్య జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చునని ఆయన అన్నారు. ఆ రాష్ట్ర ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చాలని అక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీతోనూ, హోమ్ మంత్రి అమిత్ షా తోను సమావేశమైన సంగతి విదితమే.
యూపీలో యోగికి వ్యతిరేకంగా అసమ్మతి గళం తలెత్తిందని వార్తలు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి చేరుకొని తమ రాష్ట్ర రాజకీయ పరిణామాలను బీజేపీ నాయకత్వానికి వివరించారు. కాగా బెంగాల్ లో ముకుల్ రాయ్ మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పంచన చేరడాన్ని కూడా నవాబ్ మాలిక్ గుర్తు చేశారు. అటు-ప్రశాంత్ కిషోర్ మాత్రం పవార్ తో తన భేటీపై గుంభనంగా ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Niharika Konidela: అమ్మ చీరలే అందం.. నయా రూటులో బుట్టుబొమ్మలు.. ఎంత ముద్దుగా ఉన్నారో సుమీ..!