AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mini Tractor: మ‌న‌సుంటే మార్గ‌ముంటుంది.. రూ.25వేలకే మినీ ట్రాక్ట‌ర్ త‌యారు చేసిన రైతు.. భలే ఉప‌యోగ‌ప‌డుతుంది

వ్య‌వ‌సాయం ఇప్పుడు భార‌మైపోయింది. పెట్టుబ‌డి పెట్టిన డ‌బ్బు కూడా తిరిగిరాని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇవి చాల‌వు అన్న‌ట్లు కల్తీ విత్తనాలు, ఎరువురు వారిని....

Mini Tractor: మ‌న‌సుంటే మార్గ‌ముంటుంది.. రూ.25వేలకే మినీ ట్రాక్ట‌ర్ త‌యారు చేసిన రైతు.. భలే ఉప‌యోగ‌ప‌డుతుంది
Mini Tractor
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2021 | 9:10 PM

Share

వ్య‌వ‌సాయం ఇప్పుడు భార‌మైపోయింది. పెట్టుబ‌డి పెట్టిన డ‌బ్బు కూడా తిరిగిరాని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇవి చాల‌వు అన్న‌ట్లు కల్తీ విత్తనాలు, ఎరువురు వారిని న‌ట్టేట ముంచుతున్నాయి. వ్య‌వ‌సాయం మాత్ర‌మే కాదు.. ఓ పెద్ద యుద్ద‌మే చేస్తున్నాడు రైతు. ఈ క్ర‌మంలో వారు వ్య‌వ‌సాయ ఖ‌ర్చులు త‌గ్గించుకునేందుకు కొత్త మార్గాల‌ను అన్వేశిస్తున్నారు. కాగా వ్య‌వ‌సాయం చేయాలంటే ప్రస్తుత కాలంలో ట్రాక్ట‌ర్ త‌ప్ప‌నిస‌రి అయ్యింది. దీంతో ల‌క్ష‌లు పెట్టి దాన్ని కొన‌లేని వ్య‌క్తి.. ఓ ప్ర‌త్యామ్నాయ మార్గంతో ముందుకొచ్చాడు.  మధ్యప్రదేశ్​ విదిశా జిల్లా ఘట్​వాయీ గ్రామానికి చెందిన విజయ్​ సింగ్​ రఘువంశీ అనే రైతుకు ఓ క్రేజీ థాట్ వ‌చ్చింది. ఆటో ఇంజిన్​తో ఓ మినీ ట్రాక్టర్​ను త‌యారుచేశాడు. ఇందుకోసం అత‌డు కేవలం రూ. 25వేలు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టాడు.

పాడైపోయిన ఆటో నుంచి ఇంజిన్​ కొనుగోలు చేసిన విజయ్​ సింగ్​.. దానిని స్థానిక మెకానిక్​తో రిపేర్ చేయించాడు. తానే సొంతంగా ట్రాక్టర్ బాడీ​ త‌యారుచేశాడు. ఇంజిన్​ అమర్చి, బాడీకి మూడు చక్రాలు బిగించి మినీ ట్రాక్టర్​ను రెడీ చేశాడు. ఈ కొత్త యంత్రంతో విజయ్​కు.. తన 1.5 ఎకరాల భూమిలో సాగు ఈజీ అయ్యింది. దీని​తో 3 గంటల్లో పావు ఎకరాన్ని దున్నవచ్చు. ఇందుకు కేవలం ఒకటిన్నర లీటర్ల డీజిల్​ అవసరం అవుతుందని స‌ద‌రు రైతు చెబుతున్నాడు. ఇక్క‌డ ఇంకొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ మినీ ట్రాక్టర్​ను గ్యాస్​తో కూడా నడిచే విధంగా విజయ్​ సింగ్​ ఏర్పాటు చేశాడు. 5హెచ్​పీ డీజిల్​ ఇంజిన్​ను స్టార్ట్​ చేశాక గ్యాస్​తో నడిచే విధంగా మార్చుకోవచ్చని విజయ్​ సింగ్​ వివ‌రించాడు. 14 లీటర్ల గ్యాస్​తో 58 నుంచి 62 గంటల పాటు ఇంజిన్​ పనిచేస్తుందని తెలిపాడు.

Also Read: ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి

అమ్మ చీర‌లే అందం.. న‌యా రూటులో బుట్టబొమ్మ‌లు.. ఎంత ముద్దుగా ఉన్నారో సుమీ..!

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ