Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న ఐకాన్ స్టార్.. హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్ చేస్తున్న బన్నీ..

అవకాశాలు రావాలంటారు కొందరు.. కాదు కాదు ఆ అవకాశాలను సృష్టించుకోవాలని అంటారు.. మరికొందరు. ఆ రెండో కోవలోనే పక్కాగా సూట్ అవుతారు.

Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న ఐకాన్ స్టార్.. హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్ చేస్తున్న బన్నీ..
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2021 | 8:28 PM

Allu Arjun: అవకాశాలు రావాలంటారు కొందరు.. కాదు కాదు ఆ అవకాశాలను సృష్టించుకోవాలని అంటారు.. మరికొందరు. ఆ రెండో కోవలోనే పక్కాగా సూట్ అవుతారు.. మన ఐకాన్ స్టార్ బన్నీ. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న తన అప్ కమింగ్ మూవీ.. పుష్ప ద్వారా అల్లు అర్జున్ చాలా అవకాశాలను చేజిక్కించుకోబోతున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ మూవీ ద్వారా ఓ పెద్ద ప్లానే సెట్ చేశారు ఈ స్టార్‌ హీరో. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప మూవీని రెండు పార్టులుగా తీసుకొస్తామని.. మేకర్స్ అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. బాహుబలి, కేజీఎఫ్ తరహాలో.. దీన్ని కూడా రెండు పార్టులుగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని అనుకున్నారు. ఈ నిర్ణయం తర్వాతే.. పుష్ప మేకింగ్ లోను చాలామార్పులు వచ్చాయి. అల వైకుంఠపురములో మూవీలో అల్టిమేట్ హిట్ ను అందుకున్న బన్నీ.. పుష్ప మూవీతో బాలీవుడ్ కు బాటలు వేసుకుంటున్నారు. అందులో భాగంగానే.. పుష్పను రెండు భాగాలుగా తీసుకురావడం.. హిందీ పార్ట్ కోసం బాలీవుడ్ నుంచి ప్రత్యేక యాక్టర్లు, టెక్నీషియన్లను ఈ మూవీలో భాగం చేయడం చేస్తున్నారు. అలాగే హిందీ వెర్షన్ కోసం ఐటమ్ సాంగ్ ను ప్రత్యేకంగా ఓ బాలీవుడ్ బ్యూటీతో చేయించేందుకు సిద్ధమయ్యారట.

ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్లంతా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ.. ముంబై ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఆదిపురుష్ తో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ తో.. చరణ్, ఎన్టీఆర్ కూడా నార్త్ పై దృష్టి పెట్టగా.. పవన్ కల్యాణ్ కూడా హరి హర వీరమల్లు చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో బన్నీ కూడా పుష్ప ద్వారా బాలీవుడ్ మార్కెట్ పై పట్టుసాధించేందుకు సిద్ధమయ్యారు.ఇప్పటికే సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. నార్త్ పై దృష్టి పెట్టారు. పుష్పతో హిట్ కొట్టి.. పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా పుష్ప మూవీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసేలా ఓ భారీ ప్రమోషన్ ఏజెన్సీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. ఈ ప్లాన్ సక్సెస్ అయితే.. నెక్ట్స్ నేషనల్ లెవెల్లోనే స్ట్రేయిట్ హిందీ మూవీ చేసే ఆలోచనలో ఉన్న బన్నీ.. ఇప్పటినుంచే అటువైపు అడుగులు వేస్తున్నారు మరి!

మరిన్ని ఇక్కడ చదవండి :

Rashi Khanna : ప్రభాస్ భారీ సినిమాలో ఈ బాబ్లీ బ్యూటీ దాదాపు ఖరారైందట.. ఖుషీలో రాశి ఫ్యాన్స్..

In The Name Of God: అంతు చిక్క‌ని క‌థాంశంతో ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’.. జూన్ 18 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌..