సక్సెస్ కావాలా ? అయితే ‘ మెట్లు ‘ ఎక్కాల్సిందే .. మోదీ

సక్సెస్ కావాలా ? అయితే ' మెట్లు ' ఎక్కాల్సిందే .. మోదీ

‘ మీ బాడీ ఫిట్ గా ఉంటే మైండ్ ‘ హిట్ ‘ గా ఉన్నట్టే లెక్క.. బోర్డు రూమ్ లేదా బాలీవుడ్… ఏదైనా సరే.. ఎవరైనా సరే.. ఫిట్ గా ఉన్న పక్షంలో ఆకాశాన్ని టచ్ చేసినట్టే ‘ అన్నారు ప్రధాని మోదీ. గురువారం ‘ ఫిట్ ఇండియా మూవ్ మెంట్ ‘ ని లాంచ్ చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. డైలీ రొటీన్ లో ఫిట్ నెస్ ని ఓ భాగంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. […]

Anil kumar poka

|

Aug 29, 2019 | 1:01 PM

‘ మీ బాడీ ఫిట్ గా ఉంటే మైండ్ ‘ హిట్ ‘ గా ఉన్నట్టే లెక్క.. బోర్డు రూమ్ లేదా బాలీవుడ్… ఏదైనా సరే.. ఎవరైనా సరే.. ఫిట్ గా ఉన్న పక్షంలో ఆకాశాన్ని టచ్ చేసినట్టే ‘ అన్నారు ప్రధాని మోదీ. గురువారం ‘ ఫిట్ ఇండియా మూవ్ మెంట్ ‘ ని లాంచ్ చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. డైలీ రొటీన్ లో ఫిట్ నెస్ ని ఓ భాగంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. సక్సెస్ కి ‘ ఎలివేటర్ ‘ (దగ్గరిదారి) అంటూ లేదని, ‘ స్టెయిర్స్ ‘ (మెట్లు) ఎక్కాల్సిందేనని ఆయన అన్నారు. అంటే గట్టి కృషి చేయవలసిందే అని పేర్కొన్నారు. మెట్లు ఎక్కాలంటే సత్తా ఉండాలని మోదీ చెప్పారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో పెద్ద సంఖ్యలో హాజరైన మంత్రులు, స్కూలు పిల్లలు,సెలబ్రిటీలు తదితరులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ‘ ఫిట్టర్ ఇండియా ‘ కోసం ప్రజలు శపథం చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్ ప్రచారం మాదిరే ఫిట్ ఇండియా మూవ్ మెంట్ అన్నది రావాలి.. మన జీవితానికి మంత్రం ఫిట్ నెస్.. దీనికి మనం కృషి చేయాలి అని అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ ఫిట్ ఇండియా మూవ్ మెంట్ ‘ ను ప్రభుత్వం లాంచ్ చేయడం విశేషం. ప్రజలు తమ దైనందిన జీవితంలో శారీరక బలానికి, క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని మోదీ పరోక్షంగా పిలుపునిచ్చారు. నాడు దేశం నుంచి బ్రిటిష్ పాలకులను ‘ తరిమివేసేందుకు ‘ గాంధీజీ ప్రభృతులు క్విట్ ఇండియా అంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu