సెప్టెంబర్ 1 నుంచి ఫైన్‌ల బాదుడు షురూ.. జర భద్రం గురూ!

మరో రెండు రోజుల్లో భారీ జరిమానాలతో ట్రాఫిక్ చలాన్ల బాదుడు ప్రారంభం కానుంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మీరు లైట్ తీసుకుంటే.. అంటే సంగతులు. మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు 2019 పార్లమెంట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక చట్టంలో సవరించిన 63 నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించేశారు. దీనితో సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి […]

  • Ravi Kiran
  • Publish Date - 7:21 am, Thu, 29 August 19
సెప్టెంబర్ 1 నుంచి ఫైన్‌ల బాదుడు షురూ.. జర భద్రం గురూ!

మరో రెండు రోజుల్లో భారీ జరిమానాలతో ట్రాఫిక్ చలాన్ల బాదుడు ప్రారంభం కానుంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మీరు లైట్ తీసుకుంటే.. అంటే సంగతులు. మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు 2019 పార్లమెంట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక చట్టంలో సవరించిన 63 నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించేశారు. దీనితో సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. మరి కొత్తగా వచ్చిన ఆ రూల్స్ ఏంటి.? డ్రంక్ అండ్ డ్రైవ్‌కు ఎంత జరిమానా విధిస్తారు.? అనే వాటిపై చర్చ జరుగుతోంది. లైసెన్స్ లేకుండా వాహనాన్ని ఉపయోగిస్తే ఇక నుంచి 5 వేల రూపాయలు.. మైనర్లకు బండి నడిపితే రూ.25 వేల భారీ ఫైన్ పడుతుంది.

మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే అన్ని చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. కొత్త రూల్స్ గురించి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. రూల్స్‌ను సరిగ్గా పాటిస్తే.. సినిమా టిక్కెట్లు ఇస్తామంటూ పోలీసులు వినూత్న నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు.