కోయంబత్తూరు పేలుళ్ల కేసు.. రాష్ట్రవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు
ఈ పేలుడులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు. దీంతో అదేనెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. అలాగే, ఈ కారు బాంబు పేలుడుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోయంబత్తూర్ కారు బ్లాస్ట్ కేసులో విచారణ వేగవంతమైంది.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తమిళనాడు వ్యాప్తంగా దర్యాప్తు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా NIA అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. ..ఏకకాలంలో 45 ప్రాంతాల్లో NIA సోదాలు చేపట్టింది..ఉగ్ర కుట్రకు సంబంధించిన కేసులో ఇప్పటికే అరస్టైన ఆరుగురిని NIA సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో NIA అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు.
అక్టోబర్ 23వ తేదీన కోయంబత్తూరు ఉక్కడం ఈశ్వరన్ టెంపుల్ స్ట్రీట్‌లోని సంగమేశ్వరర్ టెంపుల్ గేటు వద్ద కారు పేలిపోయింది. కారు నడుపుతున్న జేమీసా ముబిన్ నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో బేరింగ్ బాల్స్, గాజుపెంకులు, అల్యూమినియం మేకులు కనిపించండంతో అనుమానాలకు తావిచ్చింది. ఈ పేలుడులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు. దీంతో అదేనెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. అలాగే, ఈ కారు బాంబు పేలుడుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, UPA చట్టం కింద జైలులో పెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ కేసును టేకప్ చేసింది. ఈ కారు సిలిండర్ పేలుడు ఘటనకు సంబంధించి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అనుమానితుల ఇళ్లలో ఎప్పటికప్పుడు సోదాలు చేస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా 45 చోట్ల ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులకు దిగారు. చెన్నైలోని పుదుప్పేట్, పెరంబూర్, జమాలియా, మన్నాడి, కోయంబత్తూరు ఫోర్ట్ మేడు, ఉక్కడం, పొన్విజా నగర్, రత్నపురి సహా 20కి పైగా ప్రాంతాల్లో ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు.. కొత్తమేడు ప్రాంతంలో సనోబర్ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. సోదాలు కొనసాగుతున్నందున ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. చెన్నై, కొచ్చికి చెందిన ఎన్ఐఏ అధికారులు కోయంబత్తూరులో పర్యటించడం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి