ఎన్ఐఏని దుర్వినియోగం చేస్తున్నారు, అన్నదాతలు భయపడబోరు, ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు మనీందర్సింగ్

ఆందోళన చేస్తున్న రైతులను బెదిరించేందుకు కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థను వినియోగిస్తోందని, కానీ అన్నదాతలు భయపడబోరని..

  • Umakanth Rao
  • Publish Date - 5:14 pm, Wed, 20 January 21
ఎన్ఐఏని దుర్వినియోగం చేస్తున్నారు, అన్నదాతలు భయపడబోరు, ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు మనీందర్సింగ్

ఆందోళన చేస్తున్న రైతులను బెదిరించేందుకు కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థను వినియోగిస్తోందని, కానీ అన్నదాతలు భయపడబోరని ఢిల్లీ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ అధ్యక్షుడు మనీందర్ సింగ్ ఖల్సా అన్నారు. మాజీ సైనికోద్యోగులు కూడా రైతుల నిరసనలో పాల్గొంటున్నందుకు ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, ఆందోళనకారులు జాతి వ్యతిరేకులని చాటేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. యూపీకి చెందిన రైతులు ఢిల్లీకి రాకుండా యూపీ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. మేము యూపీ రైతులకు అండగా ఉంటాం అని చెప్పారు. కాగా రైతుల ఆందోళన 56 వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ శివార్లలో చలికి గజగజ వణకుతూనే వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారం కేంద్రం రైతు సంఘాలతో మళ్ళీ 10 వ విడత చర్చలు ప్రారంభించింది. మరోవైపు ఈ నెల 26 న రైతుల ట్రాక్టర్ ర్యాలీ విషయంలో కేంద్రం, ఢిల్లీ పోలీసులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సమస్య తిరిగి మొదటికొచ్చింది.