AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oxygen: ఆక్సిజన్ కోసం న్యూజిలాండ్ హై కమిషన్ ట్వీట్.. వివాదాస్పదం..సిలెండర్ సరఫరా చేసిన కాంగ్రెస్ వర్గాలు

ప్రస్తుతం కోవిడ్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఆక్సిజన్ కొరత దాదాపుగా అన్ని రాష్ట్రాలనూ వెంటాడుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంది.

Oxygen: ఆక్సిజన్ కోసం న్యూజిలాండ్ హై కమిషన్ ట్వీట్.. వివాదాస్పదం..సిలెండర్ సరఫరా చేసిన కాంగ్రెస్ వర్గాలు
New Zealand High Commission
KVD Varma
|

Updated on: May 03, 2021 | 6:37 AM

Share

Oxygen: ప్రస్తుతం కోవిడ్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఆక్సిజన్ కొరత దాదాపుగా అన్ని రాష్ట్రాలనూ వెంటాడుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంది. భారత్ లోని ఈ పరిస్థితికి ప్రపంచ దేశాలు స్పందించాయి. ఇండియాకు ఆక్సిజన్ కొరత అధిగమించడంలో తమ తోడ్పాటు అందిస్తున్నట్టు ప్రకటించాయి. చాలా దేశాల నుంచి దీనికోసం కావాల్సిన ఏర్పాట్లూ జరిగాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని న్యూజీలాండ్ హై కమిషన్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సున్నితమైన ఆక్సిజన్ కొరతను న్యూజిలాండ్ రాయబార కార్యాలయం ఎత్తి చూపినట్టు అయింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం న్యూజిలాండ్ హైకమిషన్ కార్యాలయంలో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. ఆ వ్యక్తికి ఆక్సిజన్ కావాలంటూ కమిషన్ పలువురికి ట్వీట్ చేసింది. అదేవిధంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కు కూడా తమకు ఆక్సిజన్ అవసరం.. సహాయం చేయమంటూ ట్వీట్ చేసింది. దీంతో ఇది వివాదాస్పదం అయింది. హై కమిషన్ కార్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సేవలనూ సమకూరుస్తుంది. వారికి ఏదైనా అవసరం అయితే, నేరుగా సంబంధిత ప్రభుత్వ శాఖలను సంప్రదించవలసి ఉంటుంది. దీనిని అధిగమించి ప్రయివేట్ మెసేజ్ లు పంపించడం వివాదానికి దారితీసింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో న్యూజిలాండ్ హైకమిషన్ ఆ ట్వీట్ ను తొలగించింది.

అయితే, ఈలోపుగానే కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెంటనే ఆక్సిజన్ సిలెండర్ తో న్యూజిలాండ్ హైకమిషన్ కార్యాలయానికి చేరుకోవడం, దానిని అక్కడి సిబ్బంది గేట్లు తీసి లోపలి అనుమతించడం.. ఈ ఫోటోలు కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో ఉంచడం జరిగిపోయాయి. పైగా ప్రభుత్వం న్యూజిలాండ్ హైకమిషన్ పై ఒత్తిడి తెచ్చి వారి ట్వీట్ డిలీట్ చేసేలా చేసిందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలకు దిగాయి.

ఈ సంఘటనపై విదేశాంగ శాఖ స్పందించింది. విదేశీ రాయబార కార్యాలయాల్లో ఆక్సిజన్ సహా అత్యవసర సరఫరాలను నిల్వ చేయకూడదని చెప్పింది. హై కమిషన్లు, దౌత్య కార్యాలయాలకు కావాల్సిన వైద్య సదుపాయాలను తాము వెంట వెంటనే అందిస్తున్నామంటూ వివరించింది.

Also Read: పసిఫిక్‌ మహా సముద్రం మీదుగా విమానం..ఉన్నట్టుండి పసికందు ఏడుపు..? షాక్‌లో ప్రయాణికులు!

Adar Poonawalla: కోవిడ్ టీకాల కోసం పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి.. సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో పూనవల్లా