AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిఫిక్‌ మహా సముద్రం మీదుగా విమానం..ఉన్నట్టుండి పసికందు ఏడుపు..? షాక్‌లో ప్రయాణికులు!

సోషల్​ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరలవుతున్నాయి. అయితే వీటిల్లో కొన్ని షాకింగ్‌ వీడియోలు కాగా, మరికొన్ని ఫన్నీ వీడియోలు కూడా చాలా సందర్భాల్లో నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి...

పసిఫిక్‌ మహా సముద్రం మీదుగా విమానం..ఉన్నట్టుండి పసికందు ఏడుపు..? షాక్‌లో ప్రయాణికులు!
A Viral Tiktok Video
Anil kumar poka
|

Updated on: May 02, 2021 | 11:33 AM

Share

సోషల్​ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరలవుతున్నాయి. అయితే వీటిల్లో కొన్ని షాకింగ్‌ వీడియోలు కాగా, మరికొన్ని ఫన్నీ వీడియోలు కూడా చాలా సందర్భాల్లో నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. తాజాగా గగన వీధుల్లో విహరిస్తున్న విమానంలో ఇద్దరు ఎయిర్‌హోస్టర్స్‌ షేర్‌ చేసిన వార్త వైరల్‌గా మారింది.

అది పసిఫిక్‌ మహా సముద్రం..ఆ సముద్రం మీదుగా ఓ విమానం ప్రయాణిస్తోంది. అందులోని ప్రయాణికులంతా హాయిగా నిద్రపోతున్నారు. కొందరు మాత్రం చేతుల్లో సెల్‌ఫోన్లు, న్యూస్‌ పేపర్స్‌ చదువుకుంటూ గడుపుతున్నారు. ఇంతలోనే ఇద్దరు ఎయిర్‌హోస్టర్స్‌ కంగారు పడుతూ అటుఇటు పరిగెడుతున్నారు. అది చూసిన ప్రయాణికులు కూడా భయపడిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనపడ్డారు. ఇంతలో నిద్రపోతున్న ప్యాసింజర్లు సైతం మేల్కున్నారు. అందరిలోనూ ఒకటే భయం..విమానానికి ఏదైనా ప్రమాదం జరగబోతుందా అని భయపడిపోయారు. కానీ, ఇంతలోనే ఆ ఇద్దరు ఎయిర్ హోస్టర్స్ ఓ ప్రకటన చేశారు..ఈ విమానంలో ఎవరైనా డాక్టర్స్‌ ఉన్నారా..? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగానే, ఉన్నట్టుండి విమానంలో పసికందు ఏడుపు వినిపించింది. అంతే! అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇంత ఎత్తులో ఉన్న విమానంలో అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఏడుపు ఎక్కడ్నుంచి వచ్చిందో అర్థం కాక ప్రయాణికులంతా ఆందోళనపడ్డారు. అంతలోనే ఆ ఇద్దరు ఎయిర్‌హోస్టర్స్‌..అసలు విషయం చెప్పారు.

హావాయి వెళ్తోన్న సదరు డెల్టా ఫ్లైట్‌లో ఓ నిండు గర్భిణీ ప్రయాణిస్తుందట. ఫ్లైట్‌ సరిగ్గా పసిఫిక్‌ మహా సముద్రం మీదుగా వెళ్తుండగా, ఉన్నట్టుండి ఆ గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో డాక్టర్‌ కోసం ఎయిర్‌ హోస్టర్స్‌ ప్రయత్నించేలోగానే, ఆమెకు డెలీవరి అయిపోయింది. పడంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారట. ఇదంతా విమానంలో ఉన్న ఇద్దరు ప్యాసింజర్లు వీడియో తీసి టిక్‌టాక్‌ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే