ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. చైనా, పాక్‌లకు మోదీ ఝలక్

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. కేంద్రం మ్యాప్‌ రూపంలో పాక్, చైనాలకు తడాఖా చూపించింది. ఆగస్ట్ 5వ తేదీన జమ్ముకశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూనే.. మరో ప్రాంతమైన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. […]

ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. చైనా, పాక్‌లకు మోదీ ఝలక్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 03, 2019 | 6:31 PM

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. కేంద్రం మ్యాప్‌ రూపంలో పాక్, చైనాలకు తడాఖా చూపించింది. ఆగస్ట్ 5వ తేదీన జమ్ముకశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూనే.. మరో ప్రాంతమైన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ని నిర్ణయం ఫలితంగా దేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.

అయితే.. ఈ నిర్ణయంతో అటు పాకిస్థాన్‌కు, ఇటు చైనాకు ఝలక్ ఇచ్చింది మోదీ సర్కార్. అది కూడా మ్యాప్‌తో.. అదెలా అంటే.. ఇటీవలే కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూకశ్మీర్, లడఖ్‌ల కొత్త పటాన్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), గిల్గిత్‌ బలుచిస్తాన్‌ ప్రాంతాలు, చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్‌చిన్‌లను లడఖ్‌లో కలుపుతూ చూపడం.. సంచలనంగా మారింది. తొలుత పీవోకేకు కశ్మీర్‌లో అంతర్భాగంగా చూపుతారని అంతా భావించారు. కానీ దాన్ని లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో చేర్చుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. లడఖ్‌లో కార్గిల్, లేహ్ జిల్లాలు ఉండనున్నాయి. అదే.. జమ్మూ కాశ్మీర్‌లో 20 జిల్లాలు ఉండనున్నాయి. అయితే ప్రస్తుతం పీవోకే, గిల్గిత్ బలుచిస్తాన్‌లు లడఖ్‌లో చూపడంతో.. భవిష్యత్తులో పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం అడుగులు వేసినట్లు స్పష్టం అవుతోంది. ముఖ్యంగా లడఖ్‌లో హిందువులు మెజార్టీగా ఉండగా.. అదే సమయంలో జమ్ముకశ్మీర్ ప్రాంతంలో మైనార్టీలు అధికంగా ఉంటారు. అయితే అదే సమయంలో పలు జిల్లాల్లో వేర్పాటు వాదుల ప్రాభల్యం ఉండటం సైన్యానికి ఇబ్బందిగా మారుతోంది. పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఆరంభంగా మారనుంది.