వారెవ్వా..డ్రైనేజ్‌ను క్లీన్ చేసిన మినిస్టర్..శభాస్ అంటోన్న నెటిజన్స్

మంత్రి అంటే ఆ రేంజ్..దర్పం మాములుగా ఉండవు. ఎక్కడికి వెళ్లినా కాన్వాయ్, ప్రోటోకాల్..చుట్టూ బాడీ గార్డ్స్..లెక్కకుమించిన అనుచరులు. ఇంచుమించు అన్ని చోట్లా ఇదే రేంజ్ వ్యవహారం ఉంటుంది.  కానీ ఓ మంత్రి మురుగుకాలవలోకి దిగి డ్రైనేజ్ వ్యర్థాలను క్లీన్ చెయ్యడం మీరు ఎప్పుడైనా చూశారా.. ఇప్పడు ఆయన్నే మీకు చూపించబోతున్నాం. మధ్యప్రదేశ్​లో రూలింగ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్.. మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు తానే నడుం బిగించారు.  రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల పురపాలకశాఖ మంత్రిగా […]

వారెవ్వా..డ్రైనేజ్‌ను క్లీన్ చేసిన మినిస్టర్..శభాస్ అంటోన్న నెటిజన్స్
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 03, 2019 | 9:07 PM

మంత్రి అంటే ఆ రేంజ్..దర్పం మాములుగా ఉండవు. ఎక్కడికి వెళ్లినా కాన్వాయ్, ప్రోటోకాల్..చుట్టూ బాడీ గార్డ్స్..లెక్కకుమించిన అనుచరులు. ఇంచుమించు అన్ని చోట్లా ఇదే రేంజ్ వ్యవహారం ఉంటుంది.  కానీ ఓ మంత్రి మురుగుకాలవలోకి దిగి డ్రైనేజ్ వ్యర్థాలను క్లీన్ చెయ్యడం మీరు ఎప్పుడైనా చూశారా.. ఇప్పడు ఆయన్నే మీకు చూపించబోతున్నాం.

మధ్యప్రదేశ్​లో రూలింగ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్.. మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు తానే నడుం బిగించారు.  రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల పురపాలకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రధుమన్​ సింగ్​ తోమర్.. గాల్వియర్​ నియోజకవర్గంలోని బిర్లానగర్​లో పరిశుభ్రత డ్రైవ్​ చేపట్టారు. స్థానిక 16వ వార్డులోని మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశారు. ఎనిమిది అడుగుల లోతున్న ఈ కాలువ చాలా రోజులగా క్లీన్ చెయ్యకపోవడంతో వ్యర్థాలతో పూర్తిగా నిండిపోయింది. స్థానికులు కూడా విపరీతమైన దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారు. అంతేకాదు..వర్షాలకు నీరు బ్లాకై.? ఇళ్లలోకి చేరుతోంది. ఈ విషయం తన దృష్టికి రావడంతో స్పందించిన మంత్రి తానే స్వయంగా మురుగుకాలవలోకి దిగి చెత్త బయటకు వేశారు.  దీంతో మంత్రిని నెటిజన్లు ఓ రేంజ్‌లో ప్రైజ్ చేస్తున్నారు. ప్రధుమన్​ నియోజకవర్గం వ్యాప్తంగా 30 రోజుల పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలకు స్వచ్చతపై అవగాహాన కలిగించేందుకు ఆయన ఇలా చేశారు.