బిగ్ బాస్: ఫస్ట్ అలీ రెజా, సెకండ్ వరుణ్ ఔట్..నెక్ట్స్ ఎవరంటే..?

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 చివరిదశకు చేరుకుంది. మూడో సీజన్‌ విజేత ఎవరో అతికొద్ది సమయంలో తేలిపోనుంది. నిర్విరామంగా  106 రోజుల పాటు  17 మంది కంటెస్టెంట్స్‌తో పోటాపోటిగా  సాగిన ఈ ఆటలో ఐదుగురు మాత్రమే ఫైనల్‌కి చేరారు. ఈ ఐదురుగులో ఒక్కరు మాత్రమే టైటిల్‌ను ముద్దాడనున్నారు. ఓటింగ్ లిస్ట్‌ ప్రామాణికంగా అలీ రెజా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అతిథులుగా వెళ్లి సందడి చేసిన మారుతి, హీరోయిన్‌ రాశీ ఖన్నా ఈ విషయాన్ని రివీల్‌ చేశారు. […]

బిగ్ బాస్: ఫస్ట్ అలీ రెజా, సెకండ్ వరుణ్ ఔట్..నెక్ట్స్ ఎవరంటే..?
Ram Naramaneni

|

Nov 03, 2019 | 9:14 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 చివరిదశకు చేరుకుంది. మూడో సీజన్‌ విజేత ఎవరో అతికొద్ది సమయంలో తేలిపోనుంది. నిర్విరామంగా  106 రోజుల పాటు  17 మంది కంటెస్టెంట్స్‌తో పోటాపోటిగా  సాగిన ఈ ఆటలో ఐదుగురు మాత్రమే ఫైనల్‌కి చేరారు. ఈ ఐదురుగులో ఒక్కరు మాత్రమే టైటిల్‌ను ముద్దాడనున్నారు. ఓటింగ్ లిస్ట్‌ ప్రామాణికంగా అలీ రెజా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అతిథులుగా వెళ్లి సందడి చేసిన మారుతి, హీరోయిన్‌ రాశీ ఖన్నా ఈ విషయాన్ని రివీల్‌ చేశారు. టాప్‌-5లో ఉన్న కంటెస్టెంట్లలో మొదట ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌గా అలీ రెజా పేరును వారు తెలిపడంతో అతడు బయటకు వచ్చేశాడు.

దీంతో రాహుల్‌ సిప్లి గంజ్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌లు మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో ఇంటిలో ఉన్న నలుగురు సభ్యులకు హోస్ట్ నాగ్ ఫస్ట్ రూ.10లక్షలు ఆఫర్‌ చేసి.. ఎవరైనా వాటిని తీసుకుని వెళ్లిపోవచ్చని చెప్పాడు. కానీ ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంటిలో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సలహా తీసుకున్నా, వారు కూడా మనీ తీసుకోమని చెప్పలేదు. దీంతో నాగ్ ‘ప్లాన్‌ బి’ అమలు చేశాడు. ఆ రూ.10లక్షలకు మరో రూ.10లక్షలు కలిపి, మొత్తం రూ.20లక్షలు ఆఫర్‌ చేశారు. అప్పుడు కూడా ఏ కంటెస్టెంట్ వెళ్లేందుకు సిద్దంగా లేకపోవడంతో… ప్లాన్‌-సి అమలు చేయాల్సి వచ్చింది. హీరోయిన్ కేథరిన్‌ ప్రత్యేక కవర్‌తో వచ్చి ఎలిమినేట్‌ అయ్యేవారి పేరు చెప్పే ముందు మరోసారి రూ.20లక్షలు ఆఫర్‌ చేశారు. అయినా హౌజ్ మిగిలి ఉన్న అందరూ గెలుస్తామన్న కాన్పిడెన్స్ చూపించడంతో.. చివరకు వరుణ్‌ సందేశ్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. బయటకు వచ్చిన వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్‌’లో తన జర్నీ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu