చిరు ఎంట్రీ.. బాబా భాస్కర్ ఔట్..విన్నర్‌పై వచ్చిన క్లారిటీ..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ మరికొద్ది నిమిషాల్లో ప్రకటించబోతున్నారు. టైటిల్ ముద్దాడే వ్యక్తిని ప్రకటించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారు. కాగా చివరవరకు హౌజ్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిగలగా వన్ బై వన్ ఎలిమినేట్ అవుతున్నారు. మొదట అలీ రజా, ఆ తర్వాత వరుణ్ సందేశ్, తాజాగా బాబా భాస్కర్ కూడా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లో టాప్ 3 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్‌ను నడిపించడానికి […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ మరికొద్ది నిమిషాల్లో ప్రకటించబోతున్నారు. టైటిల్ ముద్దాడే వ్యక్తిని ప్రకటించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారు. కాగా చివరవరకు హౌజ్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిగలగా వన్ బై వన్ ఎలిమినేట్ అవుతున్నారు. మొదట అలీ రజా, ఆ తర్వాత వరుణ్ సందేశ్, తాజాగా బాబా భాస్కర్ కూడా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లో టాప్ 3 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్‌ను నడిపించడానికి తెలుగు అమ్మాయైన హీరోయిన్ అంజలి స్టేజ్ పైకి వచ్చింది. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని వాళ్ల పేరుని ఒక కవర్‌లో ఉంచి అంజలికి ఇచ్చి పంపించారు నాగ్. అనంతరం బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన అంజలి వాళ్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. రూ. 25 లక్షలు తీసుకుని ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లొచ్చని అనడంతో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్‌లు వెనక్కి తగ్గలేదు. అయితే ఆ కవర్‌లో బాబా భాస్కర్ పేరు ఉండటంతో అతను హౌజ్ నుంచి బయటకు వచ్చేశాడు.