ప్రియాంకగాంధీపై ‘ నిఘా ‘ ! వాట్సాప్ హ్యాక్ !
సీనియర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్ కి గురయింది. ఇజ్రాయెలీ స్పై వేర్ ‘ పెగాసస్ ‘ ని వినియోగించి ఆమె ఫోన్ ని హ్యాక్ చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా ఆరోపించారు. మీ ఫోన్ హ్యాక్ అయిందంటూ వాట్సాప్ నుంచి మెసేజ్ అందిందని ఆయన చెప్పారు. ఈ స్నూపింగ్ సాఫ్ట్ వేర్ ని ఇతర యూజర్లు నోటిఫై చేసిన సమయంలోనే ప్రియాంక ఫోన్ కూడా హ్యాక్ అయిందన్నారు. ఈ రకమైన […]
సీనియర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్ కి గురయింది. ఇజ్రాయెలీ స్పై వేర్ ‘ పెగాసస్ ‘ ని వినియోగించి ఆమె ఫోన్ ని హ్యాక్ చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా ఆరోపించారు. మీ ఫోన్ హ్యాక్ అయిందంటూ వాట్సాప్ నుంచి మెసేజ్ అందిందని ఆయన చెప్పారు. ఈ స్నూపింగ్ సాఫ్ట్ వేర్ ని ఇతర యూజర్లు నోటిఫై చేసిన సమయంలోనే ప్రియాంక ఫోన్ కూడా హ్యాక్ అయిందన్నారు. ఈ రకమైన చర్యలతో బీజేపీ.. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఇంకా అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, జర్నలిస్టులపై కూడా ‘ గూఢచర్యం ‘ కొనసాగుతోందన్నారు. వాట్సాప్ హ్యాకింగ్ గురైన 41 మందిలో మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, లోక్ సభ మాజీ ఎంపీ సంతోష్ భారతీయ వంటివారున్నారని ఓ ఆంగ్ల పత్రిక నిన్ననే పేర్కొంది.తాజాగా.. ఇప్పటివరకు 17 మంది ఈ టార్గెట్ కు గురయ్యారట. వీరిలో లాయర్లు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ కూడా ఉన్నారు. కాగా… దీనిపై స్పందించిన ప్రియాంక గాంధీ.. పలువురు ప్రముఖులపై నిఘా పెట్టేందుకు బీజేపీ గానీ, ప్రభుత్వం గానీ ఇజ్రాయెలీ సంస్థలను వినియోగించుకోవడం పెద్ద కుంభకోణమే అవుతుందని మండిపడ్డారు. దేశ భద్రతపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పైగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా అని పేర్కొన్నారు. సెల్ ఫోన్ల ఇల్లీగల్ హ్యాకింగ్ పై సుప్రీంకోర్టు దర్యాప్తు లేదా విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం..వాట్సాప్ సంస్థను అసలు ఇలా ఎందుకు జరిగిందో వివరించాలని కోరింది. కోట్లాది భారతీయుల ప్రయివసీని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. భారత పౌరుల వ్యక్తిగత జీవితాలను ‘ కాపాడేందుకు ‘ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
‘ పెగాసస్ ‘ అంటే ?
ఇజ్రాయెల్ లోని ఎన్ ఎస్ ఓ గ్రూప్, క్యూ సైబర్ టెక్నాలజీస్ విక్రయానికి పెట్టిన ‘ పెగాసస్ ‘ స్పై వేర్ అంటే ఏమిటి ?. ఫోన్లను టార్గెట్ చేసేందుకు వాట్సాప్ నెట్ వర్క్ ట్రాఫిక్ ని మళ్లించడానికి సర్వర్లను అనుకూలంగా వినియోగించుకోవడమే.. ఇది ఒకేసారి 50 ఫోన్లను టార్గెట్ చేయగలదట.. పైగా ఏడాదిలో 500 ఫోన్లపై ‘ గూఢచర్యం ‘ నెరపగలదని ఢిల్లీలోని ఓ ప్రయివేటు సైబర్ సెక్యూరిటీ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. పెగాసస్ కు లైసెన్సు లభించాలంటే ఏడాదికి సుమారు 7 నుంచి 8 మిలియన్ డాలర్లను వ్యయం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. భారత్ లో లోక్ సభ ఎన్నికలకు ముందు టార్గెట్ కు గురైన వారిలో అనేకమంది జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులతో బాటు రాజకీయనాయకులు కూడా ఉన్నట్టు తేలింది. ఇజ్రాయెల్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎన్ ఎస్ ఓ వాట్సాప్ సర్వర్ల ద్వారా స్పై వేర్ లో 20 దేశాలకు చెందిన 1400 మందిని టార్గెట్ చేసిందని వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ పేర్కొంది.
ఈ సంస్థ తమ సర్వర్ల లోకి చొరబడి స్పై వేర్ ని వ్యాప్తి చేస్తోందని వాట్సాప్ వెల్లడించింది. అటు-వాట్సాప్ సందేశాలపై నిఘా పెట్టడం చట్ట విరుధ్ధమే కాకుండా .. సిగ్గుచేటని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ దుయ్యబట్టారు. ఈ స్పై వేర్ తో కేంద్రం నిఘా ఉంచడం హేయమని వ్యాఖ్యానించారు.