Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం

తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తోపులాటలో ఆరుగురు మృతి చెందారు. రుయా, స్విమ్స్‌లో మరో 48 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల జారీ ప్రక్రియ నేపథ్యంలో ఈ దుర్ఘటన జరిగింది.

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Tirupati Stampede
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 09, 2025 | 11:57 AM

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇప్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.

తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడ్డవారిని రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు అయింది. నారాయణవనం తహశీల్దార్‌ ఫిర్యాదు మేరకు.. ఈస్ట్‌ పీఎస్‌లో BNS 194 సెక్షన్ కింద కేసు నమోదు అయింది.

తిరుమలలో తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయిన టిటిడి శుక్రవారం వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటుంది టీటీడీ. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా.. ఏడు కొండలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పూలను తెచ్చి.. శ్రీవారి ఆలయంతోపాటూ.. చుట్టుపక్కల ఆలయాల్ని అలంకరించారు. తిరుమలలో లైటింగ్, ఎలక్ట్రిసిటీని కూడా సరికొత్తగా మార్చారు. శుక్రవారం ఉదయం ముందుగా శ్రీవారి ఆలయాన్ని తెరిచిన తర్వాత ఏకాంతంగా స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఉదయం నాలుగున్నర నుంచి భక్తులకు స్వామివారి దర్శనంకు అనుమతిస్తారు. దేశంలో HMPV వ్యాధి సోకుతోంది కాబట్టి.. భక్తులు మాస్కులు ధరించి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని టీటీడీ సూచించింది. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..