TG Police: పండగకు ఊరెళ్లేవారికి పోలీసులు సూచనలు.. ఫాలో అవ్వకపోతే మీకే నష్టం

తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. అందరూ ఒక్కచోట ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇతర కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాలలో స్థిరపడిన చాలా మంది వ్యక్తులు సొంతూర్లకు వచ్చి.. కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య చేసుకునే పండగ ఇది. అయితే పండక్కి ఊరెళ్లెవారికి ఓ అలెర్ట్...

TG Police: పండగకు ఊరెళ్లేవారికి పోలీసులు సూచనలు.. ఫాలో అవ్వకపోతే మీకే నష్టం
Locked Door
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 09, 2025 | 12:15 PM

తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త ఏడాదిలో మొట్టమొదట వచ్చే పండుగ. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇంటికి చేరి ఆనందంగా ఉండే సమయం. అందుకే రైతు, కూలీ, ధనిక, పేద అనే తేడా లేకుండా ఉన్నంతలో అందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలోనే వివిధ రకాల కళాకారులు బయటకు వస్తారు. గంగిరెద్దులవారు, చెంచులు, హరిదాసులు ఇలా రకరాల వేషధారులు పండుగ వేళ ఇల్లిల్లూ తిరుగుతూ వారిచ్చే దానాలు తీసుకుంటూ దాతలకు ఆశీర్వాదాలు ఇస్తుంటారు. అంతటి విశిష్టమైన పండుగకు వివిధ ప్రాంతాల్లో ఉన్నవారంతా సొంతూళ్లకు వెళ్తారు. అలా సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ పోలీసులు ఓ హెచ్చరిక చేస్తున్నారు.

ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య ఇతరత్రా వ్యవహారాలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ పండుగకు ప్రత్యేకంగా సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతుంటారు. ఈ కారణంగా నగరాల్లో సగానికిపైగా ఇళ్లకు తాళాలు వేసి ఉంటాయి. ప్రజలు సొంతూళ్ల బాట పట్టడంతో నగరాల్లోని పలు ఏరియాలు జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తుంటాయి. ఇదే అదునుగా దొంగలు తమ చేతికి పనిచెబుతారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు.

దొంగల నుంచి తాళం వేసిన మీ ఇంటిని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, వాటి పనితీరును పరిశీలించుకోవాలని, ఇంట్లో లైట్లు వేసి వెళ్లాలని, బంగారం, నగదు వంటి విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచవద్దని, తాళం వేసిన సంగతి తెలియకుండా కర్టెన్ వేసి ఉంచాలని, పక్కింటివారికి సమాచారం ఇవ్వాలని, బీరువా తాళాలు ఇళ్లలో పెట్టవద్దని పోలీసులు సూచనలు చేశారు. ఊరెళ్లే వారు తమ అడ్రస్, ఫోన్ నెంబర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని, విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచవద్దని, వాహనాలను రోడ్డు బయట కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేసుకోవాలని, సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకుంటూ ఉండాలని తదితర సూచనలు చేశారు. ఈ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Telangana Police

Telangana Police

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.