Archie Vaughan: ఫ్లింటాఫ్ కొడుక్కి షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్! పుత్రోత్సహంలో మైఖేల్ వాన్
ఇంగ్లండ్ క్రికెట్ U-19 జట్టుకు మైఖేల్ వాఘన్ కుమారుడు ఆర్చీ వాఘన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ కాకుండా, ఈ ఎంపిక అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్చీ తన ప్రతిభతో టీమ్‌ను విజయవంతం చేయడంపై అందరి దృష్టి ఉంది. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటనలో ఆర్చీ నాయకత్వం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠ భరితమైన వార్త షాక్ కి గురి చేసింది. ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ కాదని, మరో దిగ్గజ ఆటగాడు మైఖేల్ వాన్ కుమారుడు ఆర్చీ వాన్ ఇంగ్లండ్ U-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జనవరి 17న దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యే సిరీస్‌లో ఆర్చీ వైట్-బాల్ తో పాటూ రెడ్-బాల్ ఫార్మాట్‌లలో కూడా జట్టును నడిపించనున్నాడు.
టాప్-ఆర్డర్ బ్యాటర్, ఆఫ్‌స్పిన్నర్‌గా తన ప్రతిభతో ఆకట్టుకున్న ఆర్చీ, తన తండ్రి మైఖేల్ వాన్ 2003-2008 మధ్య ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా సేవలందించిన కాలాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ఇటీవల సోమర్‌సెట్‌తో తన ప్రొఫెషనల్ క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆర్చీ, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో మాత్రమే కాకుండా, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కూడా తన ప్రతిభను నిరూపించాడు.
ఆర్చీ మాట్లాడుతూ, “ఇంగ్లండ్‌ను ప్రతినిధి చేసే అవకాశం రావడం ప్రత్యేకమే కాకుండా, కెప్టెన్‌గా నియమితుడవడం మరింత గర్వకారణం. నా జట్టు సభ్యులతో కలిసి ఇంగ్లండ్ కోసం మంచి విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపాడు.
ఆర్చీ ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తన ప్రతిభతో మెరిసాడు. రాకీ ఫ్లింటాఫ్ చేసిన 106 పరుగులతో పాటు ఆర్చీ 85 పరుగులు చేసి, తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాడు. ఇప్పుడు అందరి దృష్టి ఆర్చీ కెప్టెన్సీలో ఇంగ్లండ్ U-19 జట్టు ప్రదర్శనపై ఉంది.
ఇంగ్లండ్ అండర్-19 జట్టు: ఆర్చీ వాన్ (సి), ఫర్హాన్ అహ్మద్, తజీమ్ అలీ, బెన్ డాకిన్స్, కేష్ ఫోన్సెకా (టెస్ట్ జట్టు మాత్రమే), అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, ఎడ్డీ జాక్, బెన్ మేయెస్, జేమ్స్ మింటో, హ్యారీ మూర్, జో మూర్స్ (ODIలు మాత్రమే), థామస్ రెవ్, ఆర్యన్ సావంత్, నవ్య శర్మ, అలెగ్జాండర్ వేడ్.