AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thyroid: థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చడం కష్టమా? అసలు పిల్లలను కనొచ్చా

థైరాయిడ్ ఉన్నవారు అదే పనిగా ఒకే డోస్ మెడిసిన్ తీసుకుంటూ ఉండకూడదు. ప్రతి ఆరు వారాలకు ఒకసారి టెస్టు చేయించి.. వైద్యుల సలహా మేరకు డోస్ మారుస్తూ ఉండాలి. థైరాయిడ్ మాత్ర పరగడపును వేసుకోవాలి. అది వేసుకన్న తర్వాత అరగంట వరకు ఏమీ తాగకూడదు.. తినకూడదు. అయితే థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చడం కష్టమవుతుందా?

Thyroid: థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చడం కష్టమా? అసలు పిల్లలను కనొచ్చా
Thyroid
Ram Naramaneni
|

Updated on: Jan 09, 2025 | 11:33 AM

Share

థైరాయిడ్ అనేది హార్మోనుల సమస్య. స్త్రీలు ఈ సమస్యతో సతమతం అవుతూ ఉంటారు.  మెడిసిన్ క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చరు అనే అపోహ ఉంది. థైరాయిడ్ ఉన్నప్పటికీ.. మందులు వాడుతుంటే.. గర్భధారణ, కాన్పులో కూడా సమస్య ఉండదు. అయితే దీన్ని లైట్ తీసుకోవడానికి లేదు. థైరాయిడ్ ఉందని తెలిస్తే..  వైద్యుల సలహా లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం అనేది థైరాయిడ్‌ ప్రధాన సింటమ్.

మెడ దగ్గర సీతాకోక చిలుక రూపంలో ఓ గ్రంథి ఉంటుంది. దాన్నే థైరాయిడ్ గ్రంథి అంటారు. హార్ట్, బ్రెయిన్, మజిల్ వంటివి సక్రమంగా పనిచేసేలా ఈ గ్రంథి హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలానే బాడీ టెంపరేచర్, గుండె కొట్టుకునే వేగాన్ని థైరాయిడ్ గ్రంథి నియంత్రిస్తూ ఉంటుంది. మన బాడీలో జీవక్రియల కోసం అవసరమైన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ గ్రంథి అవరసమైన హార్మోన్స్ రిలీజ్ చేయకపోతే.. ఆ పరిస్థితిని హైపోథైరాయిడిజమ్ అంటారు. అవసరానికి మించి హార్మోన్లు రిలీజ్ చేస్తే హైపర్‌థైరాయిడిజమ్‌గా అభివర్ణిస్తారు. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు ప్రెగ్నెంట్ అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్ ఉంటే.. అబార్షన్ అయ్యే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా శిశువు ఎదుగుదలపై కూడా ప్రభావం ఉంటుంది. అందుకే ఎప్పుడూ వైద్యులతో సంప్రదిస్తూ ఉండాలి.

మీకు థైరాయిడ్ ఉంటే.. పుట్టిన వెంటనే పిల్లలకు థైరాయిడ్ టెస్టు చేయించాలి. కొందరికి పుట్టుకతోనే సమస్య వస్తుంది. ముందుగా గుర్తించకపోతే పిల్లలకు పలు రకాలు సమస్యలు వస్తాయి. థైరాయిడ్ సమస్య వల్ల కొందరికి జుట్టు ఊడిపోతుంది. మరికొందరు బరువు పెరుగుతారు. చర్మం డ్రై అవుతూ ఉంటుంది. లైఫ్ స్టైల్ ఛేంజస్ చేసి.. వ్యాయామం చేస్తూ.. మందులు తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది. డాక్టర్ల సలహా లేకుండా థైరాయిడ్ మాత్రలు మానవద్దు.

(ఈ సమాచారం వైద్య నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఏ సమస్య ఉన్నా డాక్టర్లు సూచనలు, సలహాల మేరకే వైద్యం తీసుకోండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి