Sabudana Benefits: బిపి కంట్రోల్ అవ్వట్లేదా? ఎముకలు బలహీనంగా ఉన్నాయా? వీటిని తినాల్సిందే!
ఉపవాస సమయాల్లో మనకు మొదట గుర్తుకు వచ్చే ఆహారం 'సగ్గుబియ్యం'. కేవలం సంప్రదాయ వంటకం మాత్రమే కాదు, సగ్గుబియ్యం అద్భుతమైన పోషక విలువల గని. నవరాత్రులు లేదా ఇతర పండుగల సమయంలో రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సగ్గుబియ్యం ఎలా సహాయపడుతుందో, ఇది బరువు పెరగడానికి మరియు ఎముకల బలానికి ఇది ఎలా తోడ్పడుతుందో ఇప్పుడు చూద్దాం.

మీకు తరచుగా అలసటగా అనిపిస్తోందా? జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ డైట్‌లో సగ్గుబియ్యాన్ని చేర్చుకోవాల్సిందే! కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే ఈ ‘టపియోకా ముత్యాలు’ తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, రక్తపోటును నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. సగ్గుబియ్యం తినడం వల్ల కలిగే 5 అద్భుత ప్రయోజనాలు మీకోసం.
సగ్గుబియ్యం (Sabudana) కేవలం ఉపవాస ఆహారం మాత్రమే కాదు, ఇది ఒక పోషకాల బాండాగారం. ఖిచ్డీ, వడలు, పాయసం వంటి వివిధ రూపాల్లో తీసుకునే సగ్గుబియ్యం శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.
1. తక్షణ శక్తికి మూలం: సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. మీరు నీరసంగా లేదా అలసటగా ఉన్నప్పుడు, పాలతో కలిపి సగ్గుబియ్యం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే ఉపవాసం ఉన్నవారు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు.
2. బరువు పెరగాలనుకునే వారికి వరం: ఎంత తిన్నా బరువు పెరగని వారు సగ్గుబియ్యాన్ని తమ ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో ఉండే కేలరీలు మరియు కార్బ్స్ ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి సహకరిస్తాయి.
3. మెరుగైన జీర్ణక్రియ: సగ్గుబియ్యం చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఇది ప్రేగుల కదలికను సులభతరం చేస్తుంది. మలబద్ధకం మరియు గ్యాస్ సమస్యలతో బాధపడేవారు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
4. బలమైన ఎముకలు: సగ్గుబియ్యంలో కాల్షియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ మరియు కీళ్ల నొప్పుల (Arthritis) ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
5. రక్తపోటు నియంత్రణ: నేటి కాలంలో హై బీపీ (High BP) సర్వసాధారణం అయిపోయింది. సగ్గుబియ్యంలో ఉండే పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
