బిర్యానీ ఆకును తెలుగులో తేజపత్రం అని కూడా అంటారు. ఇది ఒక రకమైన మసాలా దినుసు. చాలా ఆరోగ్యకరమైనది. బిర్యానీ ఆకులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.
TV9 Telugu
బిర్యానీ ఆకు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
TV9 Telugu
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, ఛాతి నొప్పి వంటి సమస్యలు ఉంటే బిర్యానీ ఆకుల కషాయం తాగవచ్చు. ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుంది..
TV9 Telugu
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు దీనివల్ల తగ్గుముఖం పడతాయి. కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
TV9 Telugu
బిర్యానీ ఆకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
TV9 Telugu
బిర్యానీ ఆకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. బిర్యానీ ఆకు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
TV9 Telugu
బిర్యానీ ఆకు వెంట్రుకల ఆరోగ్యానికి మంచిది. ఇది వెంట్రుకలు రాలడం తగ్గిస్తుంది. జుట్టు మెరుపునిస్తుంది. తలనొప్పి ఉన్నప్పుడు బిర్యానీ ఆకును నీటిలో మరిగించి తాగితే తలనొప్పి తగ్గుతుంది.
TV9 Telugu
ఈ టీ తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కణజాలాలు దెబ్బతినడం అనేది తగ్గుతుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహకరిస్తాయి.