Pat Cummins: అమ్మ కమిన్సూ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా! లేడీ ఫ్యాన్ క్వశ్చన్ పై ఎలా సిగ్గుపడుతున్నాడో చూడండి
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మహిళా అభిమానుల ప్రత్యేక ఆరాధనపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. భారత అభిమానులు క్రేజీగా ఉంటారని చెప్పిన కమిన్స్, జట్టుతో ఉండే సమయానికి ప్రాధాన్యం ఇస్తాడని చెప్పాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ విజయంతో పాటు ఆస్ట్రేలియా 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మరి కమిన్స్ సారథ్యంలో జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.
క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉండటం సర్వసాధారణం. కానీ కొంతమందికి ఉన్న ప్రత్యేకత, గ్లామర్, ఆటతీరుతో అమ్మాయిల నుంచి ప్రత్యేకమైన క్రేజ్ వస్తుంది. అందుకే కొందరు ప్లేయర్స్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ప్యాట్ కమిన్స్ కూడా అలాంటి ఆటగాళ్లలో ఒకరు.
తాజాగా “డేట్ విత్ ఏ సూపర్ స్టార్” అనే షోలో పాల్గొన్న కమిన్స్ తనపై ఉన్న మహిళల ప్రత్యేక అభిమానాన్ని ఎలా డీల్ చేస్తాడో వివరించాడు. “మీకు ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మహిళల్లో మరింత ఎక్కువ ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా మీపై క్రష్ ఫీలవుతోందని చెప్పింది. మీకు పెళ్లయిందని తెలిసినా, ఇంతమంది అమ్మాయిలను ఆకర్షించగలగడం ఎలా సాధ్యమవుతోంది?” అని హోస్ట్ సాహిబా బలి ప్రశ్నించింది.
దానికి కమిన్స్ నవ్వుతూ, “దీని గురించి ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో నాకు తెలియదు. నేను నా పని మాత్రమే చేస్తాను. అంతకుమించి ఏం ఆలోచించను” అని సరదాగా సమాధానమిచ్చాడు. ఫీమేల్ అటెన్షన్ గురించి మళ్లీ అడగగా, “భారత అభిమానులు చాలా క్రేజీగా ఉంటారు. సాధారణంగా ఆటగాళ్లు ఎక్కువ సమయం జట్టుతో లేదా హోటల్‌లోనే గడుపుతారు. వ్యక్తిగతంగా బయటకు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది” అని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే, కమిన్స్ నాయకత్వంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని పదేళ్ల తర్వాత గెలుచుకుంది. 2025లో లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా అర్హత సాధించింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరడం ఆ జట్టు సత్తాను చాటుతోంది.
This was awkward as hell. Trust Star Sports to come up with this nonsense. 😭pic.twitter.com/lO13dY7eaZ
— D.🍉 (@Deep_Take001) January 6, 2025