‘ ఢిల్లీ ఆరోగ్యానికి చేటు ‘.. శశి థరూర్ సెటైర్లు !

ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నగరాన్ని సాక్షాత్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘ గ్యాస్ చాంబర్ ‘ గా అభివర్ణిస్తే.. సుప్రీంకోర్టు పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీ ని ప్రకటించింది. ఢిల్లీ ఎన్ సీ ఆర్ ప్రాంతమంతా దట్టమైన పొగ  మంచు  అలముకోవడం, వాయు కాలుష్య తీవ్రత 400… 500 మధ్య పెరిగిపోవడంతో పరిస్థితి జటిలంగా మారింది. స్కూళ్లను నాలుగైదు రోజులు మూసి వేయగా.. ప్రభుత్వం ప్రజలకు మాస్కులను పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో […]

' ఢిల్లీ ఆరోగ్యానికి చేటు '.. శశి థరూర్ సెటైర్లు !
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Nov 03, 2019 | 4:10 PM

ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నగరాన్ని సాక్షాత్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘ గ్యాస్ చాంబర్ ‘ గా అభివర్ణిస్తే.. సుప్రీంకోర్టు పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీ ని ప్రకటించింది. ఢిల్లీ ఎన్ సీ ఆర్ ప్రాంతమంతా దట్టమైన పొగ  మంచు  అలముకోవడం, వాయు కాలుష్య తీవ్రత 400… 500 మధ్య పెరిగిపోవడంతో పరిస్థితి జటిలంగా మారింది. స్కూళ్లను నాలుగైదు రోజులు మూసి వేయగా.. ప్రభుత్వం ప్రజలకు మాస్కులను పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో అనేకమంది సోషల్ మీడియా వేదికగా .. ఈ వాయు కాలుష్యాన్ని ‘ సిగరెట్ స్మోకింగ్ ‘ తో పోల్చారు. ఈ నెటిజన్లతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా కలిశారు. సిగరెట్ పెట్టెలపై ఉండే ‘ పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం ‘ (స్మోకింగ్ ఈజ్ ఇంజ్యురియస్ టు హెల్త్) అనే హెచ్చరికను మార్చి.. ‘ ఢిల్లీ ఈజ్ ఇంజ్యురియస్ టు హెల్త్ ‘ అని ట్వీటిస్తున్నారు. సిగరెట్లు, బీడీలు, సిగార్ తాగుతూ ఎంతకాలం మీ జీవిత కాలాన్ని తగ్గించుకుంటూ వస్తారు ? దీన్ని ఇంకా తగ్గించుకోవాలంటే ఢిల్లీకి రండి ‘ అని ‘ శశిథరూర్ సర్కాస్టిక్ జోకులు పేల్చారు. ఇలాగే పలువురు నెటిజన్లు తమ తమ స్టయిల్లో సెటైర్ల మీద సెటైర్లు వేశారు.