ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడగా, కొన్ని కోళ్ల ఫారాలను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో, వ్యాధి ప్రభావిత ప్రాంతాల ప్రజలు కొద్దిరోజులపాటు చికెన్, గుడ్లు తినడం మానేయాలని వైద్య ఆరోగ్య శాఖ హై అలర్ట్ జారీ చేసింది.