AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీకి బిగ్ షాక్.. అనర్హుడిగా మారిన ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా మారాడు. దీనికి కారణం ఆయన ఓ కేసులో దోషిగా తేలడం. వివరాల్లోకి వెళితే.. పవాయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రహ్లాద్ లోథి అసెంబ్లీ సభ్యత్వం రద్దయ్యింది. గతంలో ఉన్న ఓ పాత కేసు విషయంలో ఆయనను స్పెషల్ కోర్టు దోషిగా పేర్కొంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి ఈ విషయాన్ని తెలియజేస్తూ, కోర్టు తీర్పు నేపథ్యంలో […]

బీజేపీకి బిగ్ షాక్.. అనర్హుడిగా మారిన ఎమ్మెల్యే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 03, 2019 | 3:51 PM

Share

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా మారాడు. దీనికి కారణం ఆయన ఓ కేసులో దోషిగా తేలడం. వివరాల్లోకి వెళితే.. పవాయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రహ్లాద్ లోథి అసెంబ్లీ సభ్యత్వం రద్దయ్యింది. గతంలో ఉన్న ఓ పాత కేసు విషయంలో ఆయనను స్పెషల్ కోర్టు దోషిగా పేర్కొంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి ఈ విషయాన్ని తెలియజేస్తూ, కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రహ్లాద్ లోథి అసెంబ్లీ సభ్యత్వం రద్దయిందని తెలిపారు. అంతేకాదు రాష్ట్ర అసెంబ్లీలో ఒక సీటు కూడా ఖాళీ అయిన విషయాన్ని.. ఈసీ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

కాగా, ప్రహ్లాద్ లోథి అసెంబ్లీ సభ్యత్వం రద్దుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాకేష్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోథిని అనర్హుడిగా ప్రకటిస్తూ.. అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడం ప్రతీకార చర్యేనని, ఉన్నత స్థానంలో ఉండాల్సిన స్పీకర్.. పూర్తిగా కాంగ్రెస్ మనిషిగా వ్యవహరించారని రాకేష్ సింగ్ ఆరోపించారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామన్నారు. అయితే 2014లో పన్నా జిల్లా తహసిల్దార్ ఆర్‌కే వర్మపై దాడికి సంబంధించిన కేసులో.. లోథితో సహా 12 మందిని స్పెషల్ కోర్టు దోషులుగా పేర్కొంటూ.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!