AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5లో తోపు బౌలర్ ఎవరంటే?

Bowlers Who Taken Hat-tricks In T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో తొలి హ్యాట్రిక్ సాధించిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ పేరిట ఉంది. లీతో పాటు, ఈ టోర్నమెంట్‌లో మరో ఐదుగురు బౌలర్లు ఈ ఘనతను సాధించారు.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5లో తోపు బౌలర్ ఎవరంటే?
Hat Tricks In T20 World Cup
Venkata Chari
|

Updated on: Feb 10, 2026 | 3:07 PM

Share

Hat trick Wickets Bowlers In T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు 10 మ్యాచ్ లు పూర్తయ్యాయి. టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. చిన్న జట్లుగా బరిలోకి దిగి దిగ్గజ టీంలకే దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నాయి. అమెరికా, నేపాల్ వంటి జట్లు టోర్నమెంట్ లో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల మోత అని భావిస్తుంటారు. కానీ, ఈ ఫార్మాట్ లో బౌలర్ల కూడా తమదైన రోజున దిగ్గజ బ్యాటర్లకు కూడా దడదడ పుట్టిస్తుంటారు. ఇక ముఖ్యంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు కూడా ఉన్నారు. టీ20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించిన 8మంది బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన 8 మంది బౌలర్లు..

1. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా): ఐసీసీ టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం బ్రెట్ లీ రికార్డ్ సాధించాడు. 2007లో బంగ్లాదేశ్‌పై ఈ ఘనతను సాధించాడు.

2. కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్): బ్రెట్ లీ తర్వాత రెండో బౌలర్ గా ఐర్లాండ్‌కు చెందిన కర్టిస్ కాంఫర్ ఈ రికార్డుల్లో చేరాు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో కర్టిస్ కాంఫర్ తన కెరీర్ లోనే తొలి హ్యాట్రిక్ సాధించాడు. 2021 టీ20 ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్‌పై క్యాంఫర్ ఈ ఘనతను సాధించాడు.

3. వనిందు హసరంగా (శ్రీలంక): శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా ఈ లిస్ట్ లో మూడో బౌలర్ గా చేరాడు. 2021 టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

4. కగిసో రబడ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ టీ20 ప్రపంచ కప్ 2021లో హ్యాట్రిక్ సాధించాడు. ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించి టీ20 ప్రపంచ కప్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు.

5. కార్తీక్ మెయ్యప్పన్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు చెందిన కార్తీక్ మెయ్యప్పన్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ సాధించిన ఐదవ బౌలర్ గా నిలిచాు. మెయ్యప్పన్ 2022 లో శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..