AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పీకర్‌ ఓంబిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసులు అందజేత!

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ సహా మొత్తం 118 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. విపక్షాలకు స్పీకర్‌ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

స్పీకర్‌ ఓంబిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసులు అందజేత!
Om Birla No Confidence Motion
Anand T
|

Updated on: Feb 10, 2026 | 2:54 PM

Share

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ రూల్‌ 94 సీ కింద స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని. దానిపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకేతో సహా ఇతర పార్టీలకు చెందిన మొత్తం 120 మంది ఎంపీలు సంతకాలు చేశారని.. విపక్ష పార్టీల నేతలు, రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ ఎంపీలు పదే పదే అడ్డుతగుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీలు ఆరోపించారు. బీజేపీ సభ్యులు సభలో బండబూతులు మాట్లాడుతున్నప్పటికి మైక్‌ కట్‌ చేయడం లేదని అన్నారు.

ఇక విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను పరిశీలించాలని లోక్‌సభ సెక్రటేరియట్‌ను స్పీకర్‌ ఆదేశించారు. మరోవైపు విపక్షాల అవిశ్వాస తీర్మానానికి టీఎంసీ మద్దతుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. స్పీకర్‌కు మూడు రోజుల సమయం ఇవ్వాలని, తరువాత అవిశ్వాస తీర్మానం గురించి ఆలోచించాలని టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ అన్నారు. స్పీకర్‌కు తమ డిమాండ్లపై కాంగ్రెస్‌ లేఖ రాయాలని సూచించారు.

అయితే స్పీకర్ పై అవిశ్వాసానికి 273 మంది లోక్ సభ సభ్యుల మద్దతు తప్పనిసరి అవసరం- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(c), లోక్ సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ రూల్ 200 ప్రకారం అవిశ్వాస ప్రక్రియ ఉంటుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే లోక్‌సభ సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు అవసరం. నోటీసు అందిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించే మోషన్‌ను లిస్ట్ ఆఫ్ బిజినెస్‌లో చేర్చనున్నారు స్పీకర్. నోటీసు అందిన తేదీ నుంచి కనీసం14 రోజుల తర్వాతే ప్రక్రియ జరుగుతుంది. స్పీకర్ అవిశ్వాస తీర్మానం చర్చకు డిప్యూటీ స్పీకర్ సభాద్యక్షత వహిస్తారు. అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌కు మాట్లాడే హక్కు ఉంటుంది. అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే హక్కు కూడా స్పీకర్‌కు ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!