AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రీ గా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇలా అప్లై చేసుకోండి..

మహిళలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రూపాయి ఖర్చు లేకుండా కొత్త గ్యాస్ కనెక్షన్ అందించనుంది. ఉజ్వల పథకం కింద ఉచితంగా సిలిండర్, స్టౌవ్ తో పాటు ప్రతి గ్యాస్ బుకింగ్ పై రూ. 300 సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. దీనికి ఎవరు అర్హులు? ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్రీ గా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇలా అప్లై చేసుకోండి..
Pm Ujjwala Yojana Scheme
Krishna S
|

Updated on: Feb 10, 2026 | 3:45 PM

Share

పేద కుటుంబాల్లోని మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంట గ్యాస్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తోంది. మొదటిసారి గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి గ్యాస్ స్టౌవ్, సిలిండర్ ఉచితంగా అందజేస్తారు. ప్రతి సిలిండర్‌పై రూ.300 రాయితీ లభిస్తుంది. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ ప్రయోజనం వర్తిస్తుంది.

ఎవరు అర్హులు?

ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. కుటుంబంలో ఎవరికీ ఇదివరకే ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1 లక్ష, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించి ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.

కావాల్సిన పత్రాలు

దరఖాస్తు సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి.

ఇవి కూడా చదవండి
  • రేషన్ కార్డు
  • ఆధార్ కార్డు
  • బ్యాంక్ ఖాతా వివరాలు
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం

మీరు ఇంటి వద్ద నుండే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు..

మొదట అధికారిక వెబ్‌సైట్ www.pmuy.gov.in సందర్శించండి.

హోమ్ పేజీలో Apply for New Ujjwala 2.0 Connection పై క్లిక్ చేయండి.

మీకు నచ్చిన గ్యాస్ కంపెనీని ఎంచుకోండి.

మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా లాగిన్ అవ్వండి.

అప్లికేషన్ ఫామ్‌లో పేరు, అడ్రస్, ఆధార్, బ్యాంక్ వివరాలను జాగ్రత్తగా నింపండి.

చివరగా దరఖాస్తును సబ్మిట్ చేసి, ఆ ప్రింటవుట్‌ను దగ్గర పెట్టుకోండి.

మీకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం తెలియకపోతే, దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్లు వెరిఫై అయిన తర్వాత కనెక్షన్ మంజూరు అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తమామలకు విద్యుత్ షాక్ పెట్టిన అల్లుడు.. చివరకు..
అత్తమామలకు విద్యుత్ షాక్ పెట్టిన అల్లుడు.. చివరకు..
ఒకటి కాదు, ఏకంగా 2సార్లు ఢీ కొట్టనున్న భారత్, పాక్ జట్లు..?
ఒకటి కాదు, ఏకంగా 2సార్లు ఢీ కొట్టనున్న భారత్, పాక్ జట్లు..?
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
ఫ్రీ గా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
ఫ్రీ గా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!