కర్నూలు జిల్లా ఆస్పరి, హోలగుంద మండలాల్లో టమోటా ధరలు కిలో రూ.5కి పడిపోయాయి. రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. హోలగుందకు చెందిన రైతు నాగరాజు టమాటాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. రూ.40 కనీస మద్దతు ధర కావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.