Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదోతరగతి సిలబస్‌లో మరికొన్ని పాఠ్యాంశాలు తొలగింపు.. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నిపుణులు

కొన్నిరోజుల క్రితం 9, 10, 11, 12 తరగతులకు సంబంధించిన సిలబస్‌లో కొన్ని పాఠ్యాంశాలను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 10వ తరగతి సిలబస్‌లో మరికొన్ని పాఠ్యాంశాలను తొలగించినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది.

పదోతరగతి సిలబస్‌లో మరికొన్ని పాఠ్యాంశాలు తొలగింపు.. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నిపుణులు
Books
Follow us
Aravind B

|

Updated on: Jun 01, 2023 | 9:37 PM

కొన్నిరోజుల క్రితం 9, 10, 11, 12 తరగతులకు సంబంధించిన సిలబస్‌లో కొన్ని పాఠ్యాంశాలను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 10వ తరగతి సిలబస్‌లో మరికొన్ని పాఠ్యాంశాలను తొలగించినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. సైన్స్ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌, ఇంధన మూలకాలు, సహజ వనరుల నిర్వహణ, డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌-1 నుంచి ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు పాఠాలు తొలగించిన వాటిలో ఉన్నట్లు పేర్కొంది. ఇకనుంచి ఎన్‌సీఈఆర్‌టీ 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ పాఠాలను చదవాల్సిన అవసరదని.. విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

కరోనా వచ్చిన సమయంలో విద్యార్థులపై భారం పడకుండా కొన్ని పాఠ్యాంశాలను ఎన్‌సీఈఆర్‌టీ తాత్కాలికంగా తొలగించింది. అయితే తాజాగా ముద్రించిన కొత్త పుస్తకాల్లో వాటిని శాశ్వతంగా తొలగించేసింది. ఇండియాలో 10వ తరగతి వరకు సైన్స్‌నుల తప్పనిసరి పాఠ్యంశంగా బోధిస్తారు. ఆ తర్వాత సైన్స్ గ్రూప్‌ చదివే విద్యార్థులకు మాత్రమే తొలగించిన పాఠ్యాంశాల గురించి తెలుసుకోగలుగుతారు. మరోవైపు ఎంతో ముఖ్యమైన పిరియాడిక్‌ టేబుల్‌ వంటి పాఠ్యాంశాలను 10వ తరగతి సైన్స్ పుస్తకాల తొలగించడంపై విద్యారంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. ఇది ఈ విద్యాసంవత్సరం సిలబస్ మార్పు చేయలేదని.. గత ఏడాది జూన్ లోనే సిలబస్ హేతుబద్దీకరణ జరిగినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో