ఇంకా మీరు మారర్రా.. మంచి దుస్తులు, కళ్లజోడు పెట్టుకున్నందుకు దళితునిపై దాడి చేసిన అగ్రవర్ణాల వ్యక్తులు
దేశం సాంకేతిక రంగంలో ముందుకు వెళ్తున్నప్పటికీ కుల వివక్ష మాత్రం ఇంకా ఉనికిలోనే ఇంది. ఎక్కడో ఓ చోట దళితులపై వివక్ష, అణిచివేతలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి గుళ్లోకి రానియకపోవడం, వాళ్లు వండిన అన్నం తినకపోవడం లాంటి ఘటనలు ఇంకా చోటుచేసుకుంటున్నాయి.

దేశం సాంకేతిక రంగంలో ముందుకు వెళ్తున్నప్పటికీ కుల వివక్ష మాత్రం ఇంకా ఉనికిలోనే ఇంది. ఎక్కడో ఓ చోట దళితులపై వివక్ష, అణిచివేతలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి గుళ్లోకి రానియకపోవడం, వాళ్లు వండిన అన్నం తినకపోవడం లాంటి ఘటనలు ఇంకా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్‌లో ఓ దళిత వ్యక్తి మంచి దుస్తులు ధరించి, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నందుకు అతనిపై కొంతమంది అగ్రవర్ణాలకు చెందినవారు దాడి చేయడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే బయస్కాంత జిల్లా మెటా గ్రామానికి చెందిన జిగర్ షెఖాలియా అనే దళిత వ్యక్తి మంగళవారం తన ఇంటి ముందు నిల్చున్నాడు. అగ్రవర్ణానికి చెందిన ఓ వ్యక్తి అతడ్ని చూసి చాలా ఎత్తుకు ఎదుగుతున్నావని.. అతని స్థాయిలో ఉండకపోతే చంపేస్తానని బెదిరించాడు.
అదేరోజు రాత్రికి ఓ గుడి దగ్గర ఉన్న జిగర్ వద్దకు అగ్ర వర్ణాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు వచ్చారు. మంచి దుస్తులు, కళ్లద్దాలు పెట్టుకోవడాన్ని చూసి అతడ్ని ప్రశ్నించారు. కర్రలతో కొట్టి, ఈడ్చుకెళ్లారు. ఇది గమనించిన జిగర్ తల్లి పరుగెత్తుకుని అక్కడికి వచ్చింది. దీంతో ఆమెను కూడా ఆ వ్యక్తులు కొట్టారు. ఆమె దుస్తుల చించారు, చంపుతామంటూ తల్లికొడుకులిద్దర్ని బెదిరించారు. అనంతరం ఈ ఘటనపై జిగర్ షెఖాలియా, అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజపుత్ వర్గానికి చెందిన ఏడుగురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీస్ అధికారి పేర్కొన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం