వికసిత్ భారత్ లక్ష్యంగా ఆది కర్మయోగి అభియాన్‌పై జాతీయ సమావేశం.. ఎప్పుడంటే?
విక్షిత్ భారత్@2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గిరిజనాభివృద్ధి ధ్యేయంగా అక్టోబర్ 17న ఆది కర్మయోగి అభియాన్ పై జాతీయ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం గిరిజన నాయకత్వాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.

విక్షిత్ భారత్@2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గిరిజనాభివృద్ధి ధ్యేయంగా అక్టోబర్ 17న ఆది కర్మయోగి అభియాన్ పై జాతీయ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం గిరిజన నాయకత్వాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, అభివృద్ధి అద్భుతమైన పురోగతిని సాధించడం కోసం జాతీయ స్థాయిలో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి దుర్గా దాస్ తెలిపారు.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి PMJANMAN, DAJAGUA వంటి అనేక మైలురాయి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆది కర్మయోగి అభియాన్ 2025పై జాతీయ సమావేశం విక్షిత్ భారత్@2047 కోసం గ్రాస్‌రూట్స్ గవర్నెన్స్‌కు సాధికారత కల్పించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అభియాన్, ధర్తి ఆబా జన్భాగిదరి అభియాన్ కింద ఉత్తమ ప్రదర్శనకారులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించనున్నారు.
ప్రధానమంత్రి ప్రకటించిన విక్షిత్ భారత్ దార్శనికత ప్రకారం PMJANMAN, ధర్తి ఆబా అభియాన్‌లతో కలిపి, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025 అక్టోబర్ 17న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆది కర్మయోగి అభియాన్‌పై జాతీయ సమావేశం నిర్వహిస్తుంది. ఇది భారతదేశం ప్రతిస్పందనాత్మక, పౌరుల నేతృత్వంలోని పాలన వైపు ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుందని కేంద్ర మంత్రి దాస్ తెలిపారు. రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా “గిరిజన గ్రామ విజన్ 2030”పై దృష్టి సారించిన అంశాలు, ఆలోచనలపై ప్రధానంగా చర్చిస్తారు.
గిరిజనాభివృద్ధి కోసం విధానాన్ని ఖరారు చేయడం లక్ష్యంగా “గిరిజన గ్రామ విజన్ 2030” అనే భావనను రూపొందించడం జరుగుతుంది. ఇన్‌పుట్‌లు, ప్రాజెక్టు అమలు వ్యూహాలను దేశ నలుమూలల నుంచి వచ్చే 50 వేలకు పైగా గిరిజన ప్రతినిధుల నుంచి సంప్రదింపులను సలహాలను స్వీకరిస్తారు.గ్రామ కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తారు.
ప్రాధాన్యత రంగాలపై ప్రధాన చర్చః
1. విద్య-నైపుణ్య అభివృద్ధి
2. ఆరోగ్యం-పోషకాహారం
3. జీవనోపాధి-వ్యవస్థాపకత
4. మౌలిక సదుపాయాలు (గృహ నిర్మాణం, విద్యుత్, రోడ్లు, కనెక్టివిటీ)
5. పాలన-సంస్థాగత బలోపేతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఆది కర్మయోగి అభియాన్‌ను ప్రారంభించారు. ఆది కర్మయోగి అభియాన్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన-అట్టడుగు నాయకత్వ మిషన్‌గా నిలుస్తుంది. సేవ,సమర్థన, పరిష్కారం సూత్రాలపై నిర్మించారు. ఇక ఇప్పటి వరకు, 56,000లకు పైగా గిరిజన గ్రామ విజన్ 2030 కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. 53,000 ఆది సేవా కేంద్రాలను విధాన మార్గదర్శక సాధనంగా, సంస్థాగత యంత్రాంగంగా స్థాపించారు. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 10 లక్షలకు పైగా ఆది సాథీలు, ఆది సహయోగుల భాగస్వామ్యం ద్వారా 11.5 కోట్ల గిరిజన పౌరులకు సాధికారత కల్పించాలనే దార్శనికతతో ఈ మిషన్ కొనసాగుతోంది. ఈ మిషన్ 20 లక్షలకు పైగా అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, గిరిజన యువతకు పాలన ప్రక్రియ ప్రయోగశాలల ద్వారా శిక్షణ ఇచ్చారు. గిరిజన ప్రయోజనం పట్ల సున్నితత్వంపై దృష్టి సారించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




