PM Modi @ 75: శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకంతో మోడీ కార్యకర్తగా నాడు.. ప్రధానిగా నేడు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు తన 75వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ నేతలు వార్మ్ విషెస్ చెప్పారు. ఒక సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పదవి చేపట్టిన నరేంద్ర మోడీ ప్రయాణంలో అనేక రికార్డులున్నాయి. మోడీ కార్యకర్తగా ఉన్న సమయంలో ఉగ్రవాదం ఉదృతంగా ఉన్న సమయంలో శ్రీనగర్ లో జాతీయ జెండా ఎగరవేసిన ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలను యావత్ భారత దేశం ఘనంగా జరుపుకుంటుంది. నేడు మోడీ 75వ యేట అడుగుపెట్టారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నరేంద్ర మోడీ గుజరాత్ లోని వాద్ నగర్ లో హీరా బెన్, దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీలకు 1950 సెప్టెంబర్ 17 న జన్మించారు. పెద్ద కుమారుడు సోమాభాయ్ మోడీ. అమృత్‌భాయ్ మోడీ రెండవ సంతానం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అతని తోబుట్టువులలో మూడవవాడు. అతని తమ్ముడు ప్రహ్లాద్ మోడీ, తరువాత అతని ఏకైక సోదరి వసంతిబెన్, అతని చిన్న సోదరుడు పంకజ్ మోడీ ఉన్నారు.
1991 ఏక్తా యాత్ర
గుజరాత్ లోని వాద్ నగర్ లో ఛాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్న తండ్రికి సాయం చేస్తూ చదువుకునేవారు. అలా టీ అమ్ముతూ ఆర్ఎస్ఎస్ తో పరిచయం మోడీ జీవితాన్ని సమూలంగా మార్చేసింది. కార్యకర్తగా ఉన్న సమయంలోనే జమ్మూ కశ్మీర్ సంపూర్ణంగా భారత దేశంలో భాగం కావాలని కోరుకున్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలో 1991 ఏక్తా యాత్ర చేపట్టింది. అప్పటి బిజెపి అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి ఈ యాత్రకు నేతృత్వం వహించారు. డిసెంబర్ 11, 1991న తమిళనాడులోని కన్యాకుమారిలో సుబ్రమణ్య భారతి జన్మదినం రోజున ప్రారంభమైన ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారత జెండాను ఎగురవేయడంతో ముగిసింది.
1992 :: Narendra Modi and Murli Manohar Joshi Hoisting Indian Flag In Lal Chowk , Srinagar (J&K) pic.twitter.com/kZJPcdNPC8
— indianhistorypics (@IndiaHistorypic) December 11, 2023
లాల్ చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరణ
1990లలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం శిఖరాగ్రంలో ఉన్నప్పుడు, వేర్పాటువాద హింస కాశ్మీర్‌ను భారతదేశం నుంచి వేరు చేయడానికి ప్రయత్నించినప్పుడు.. శ్రీనగర్ లోని లాల్ చౌక్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మురళీ మనోహర్ జోషి తో కలిసి నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించిన ఫోటో మళ్ళీ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
చీనాబ్ రైలు వంతెనపై త్రివర్ణ పతకంతో కవాతు
అంతేకాదు పహల్గామ్ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్‌తో జరిగిన సైనిక వివాదం తర్వాత ప్రధాని మోడీ చేతిలో భారతీయ జెండా చేత బట్టి చీనాబ్ రైలు వంతెనపై ఒంటరిగా కవాతు చేశారు. శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారు. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో రియాసి జిల్లాలోని చీనాబ్ రైలు వంతెనపై త్రివర్ణ పతకాన్ని ఊపుతూ ప్రధాని మోడీ నడిచారు. పాకిస్తాన్‌తో జరిగిన మినీ యుద్ధం నేపథ్యంలో దేశంలో దేశభక్తి ఉధృతంగా పెరుగుతున్న తరుణంలో, ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఊపుతున్న దృశ్యం ప్రపంచానికి ఒక సందేశం. ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఊపడం కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని నొక్కి చెప్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




