15ఏళ్ల బాలికపై పగబట్టిన పాము.. ఇంట్లో తిష్టవేసి 40 రోజుల్లో 12 సార్లు కాటు.. చివరికి ఏం చేశారంటే..
పాము పగబట్టడంపై ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక పాము ఒక ఇంట్లో నివాసం ఉండి.. 40 రోజుల్లో 12 సార్లు ఒక బాలికని కాటు వేసింది. పాము బాధ పడలేక బాలికని ఇంటి నుంచి పంపిస్తే.. ఆ బాలిక తండ్రిని పాము ముప్పుతిప్పలు పెట్టిందట.. దీంతో ఆందోళన చెందిన ఆ కుటుంబం పాముని పట్టుకుని అడవిలో సురక్షితంగా విడిచి పెట్టారు. ఈ విచిత్ర కేసు ఉత్తర్ ప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని సిరాధు తహసీల్‌లోని భేషాపర్ గ్రామంలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా ఈ గ్రామం పాముల బాడిన పడిన గ్రామంగా ప్రసిద్ది చెందింది. ఈ గ్రామంలో నివాసం ఉంటున్న 15ఏళ్ల రియా మౌర్య అనే బాలికను పాము పదేపదే కాటు వేసింది. ఇది ఆమె కుటుంబాన్ని, గ్రామస్తులను ఆందోళనకు గురిచేసింది. జూలై 22 నుంచి ఒక పాము రియాను 12 సార్లు కంటే ఎక్కువ కరిచింది. ఆమె తండ్రి రాజేంద్ర మౌర్య ఆసుపత్రి చికిత్స ఇప్పించడమే కాదు.. పాము పదే పదే కాటు వేయకుండా భూతవైద్యం సహా ప్రతిదీ ప్రయత్నించాడు. అయినా సరే పాము పట్టు విడువలేదు. రియా ఇల్లు మట్టితో నిర్మించిన ఇల్లు. దీంతో పాము ఆ ఇంట్లో వివిధ ప్రదేశాలలో దాక్కుంది.
పాము బారినుంచి కాపాడడానికి రియాను ఆమె బంధువులు ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఆ కుటుంబం ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు .. రిఫ్రిజిరేటర్ వెనుక పాము చర్మం(పాము కుబుసం) కనిపించింది. దీంతో ఇంట్లో పాము దాక్కున్నట్లు వారికి పూర్తి నమ్మకం కలిగింది. రియా తండ్రి రాజేంద్ర మౌర్య పామును గమనించి పాములు పట్టే వారిని పిలిచాడు. 3 గంటలు కష్టపడి ఇంటి మట్టి గోడనుతవ్వి పామును బయటకు తీశారు. పాము బయటకు వచ్చిన వెంటనే గ్రామస్తులలో భయాందోళనలు చెలరేగాయి. అయితే పామును సురక్షితంగా పట్టుకున్నారు. పాములవాడు ఆ పామును తీసుకొని అడవిలో వదిలేశాడు.
40 రోజుల్లో 12 సార్లు కాటు
జూలై 22న మొదటిసారిగా వరి నాట్లు వేయడానికి పొలానికి వెళుతుండగా.. రియా కాలిపై పాము కాటు వేసింది. దీని కారణంగా రియాను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో, వైద్యులు ఆమెను ప్రయాగ్‌రాజ్‌కు రిఫర్ చేశారు. అయితే ఆమెను ప్రయాగ్‌రాజ్‌కు తీసుకెళ్లే బదులు కుటుంబ సభ్యులు ఆ బాలికను మంఝన్‌పూర్ తేజ్‌మతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. రియా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పు తర్వాత ఆమెను మళ్ళీ పాము కరిచింది. అప్పటి నుంచి రియాను 40 రోజుల్లో 12 సార్లు పాము కరిచింది.
తండ్రి రాజేంద్ర ఏమి చెప్పారంటే..
జూలై 22 నుంచి తన కూతురు రియాను కాటేస్తున్న పాము ఇదేనని రాజేంద్ర మౌర్య అన్నారు. చికిత్సతో పాటు, రాజేంద్ర మౌర్య భూతవైద్యం కూడా చేయించాడు. అయితే పాము కాటు నుంచి ఉపశమనం లేదు. తన కూతురికి చికిత్స చేయించి ఇంటికి చేరుకున్నప్పుడల్లా.. ఆ పాము రియాని కాటేసేదని చెప్పాడు. అవకాశం చూసి ఆ పాము రియా కాళ్ళను చుట్టుకుని ఆమెను కాటేసేది. రియాను ఆమె బంధువుల ఇంటికి పంపగానే.. ఆ పాము తనను ఇబ్బంది పెట్టడం ప్రారంభించిందని చెప్పాడు. ఎట్టకేలకు ఇంటి నుంచి పాముని పట్టుకుని అడవిలో విడిచి పెట్టడంతో రియా కుటుంబం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది.
सिराथू तहसील क्षेत्र के भैसहापर गांव के रहने वाले राजेन्द्र मौर्य की 15 वर्षीय बेटी की मानें तो
बीते 22 जुलाई को खेत में धान की रोपाई के दौरान एक सांप ने उसे डस लिया था इलाज करवाया और बच्ची स्वस्थ हो गई
किन्तु इसके बाद से सर्प उसे बार-बार उसे डस रहा है जिसके चलते पूरा परिवार… pic.twitter.com/mhIRyolkZ2
— Prime News (@PrimeNewsInd) August 31, 2025
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




